»   »  నిహారిక నిజంగానే నాగశౌర్య ని భయపెడుతోందా..?

నిహారిక నిజంగానే నాగశౌర్య ని భయపెడుతోందా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అతితక్కువ సినిమాలే చేసినా మంచి నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. టాలీవుడ్ లవర్ బాయ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతున్న నాగ శౌర్య కి నిజానికి ఇంకోక రెండుసినిమాల్లో ఆ ఆ ఇమేజ్ వచ్చి తీరుతుంది కూడా. అయితే ఇప్పుడు శౌర్య చేస్తున్న "ఒక మనసు" మాత్రం అతనికి ఎటువంటి గుర్తింపూ లేదు...

ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నిహారిక మాత్రమే గుర్తుకు రావటం.. వల్ల పాపం శౌర్య కి మర్రిచెట్టు కింద ఉన్న చిన్న మొక్క లా కనిపించే పరిస్థితి.. ఈమధ్యనే పాటలు విడుదల అయి విడుదలకు సిద్దం అయిన ఈసినిమాలో హీరోయిన్ గా నిహారిక నటిస్తూ ఉండటంతో ఆమె మెగా కుటుంబం నేపథ్యం బ్యాకింగ్ తో సహజంగా ఇది మెగా డాటర్ సినిమా గానే మారిపోయింది.

దీనికితోడు ఇటీవల జరిగిన అడియో ఫంక్షన్ మొత్తం నీహారిక మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లా కనిపించింది తప్ప అందులో నాగశౌర్య హీరో అని అతగాడి సినిమా ఫంక్షన్ అని ఎక్కడా అనిపించలేదనే టాక్ ఇప్పటికే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విశయం లో ఈ వర్థమాన హీరోని కాస్త ఇబ్బంది పెడుతోందట.

is Naga Sourya feared of Niharika..?

ఇది ఇలా ఉండగా ఇటీవల ఒక ఛానెల్ గేమ్ షోకి నాగశౌర్య ను గెస్ట్ గా రావాలని కాంట్రాక్ట్ చేస్తే సింగిల్ గా రమ్మంటే వస్తానని, హీరోయిన్ నిహారిక వస్తే తను రానని చెప్పినట్లు టాక్. దానితో ఏమిచేయాలో తోచక ఆ గేమ్ షో నిర్వాహకులు సైలెంట్ అయి పోయినట్లు ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇందులో ఎంత నిజమో కాదో తెలీదు గానీ. నాగశౌర్యని జాలి గా చూసే వాళ్ళ సంఖ్య మాత్రం పెరిగిపోతోంది.

"ఒక మనసు" సక్సస్స్ అయినా తనకు ఏమి కలిసి వస్తుంది అన్న ఆలోచనలో ఉన్నట్లు గాసిప్ లు మాత్రం ఎక్కువగనే వినిపిస్తున్నాయి. జూన్ 24న విడుదలకు రెడీ అవుతున్న ఈసినిమా విడుదల తరువాత మాత్రమే నాగశౌర్య భయాలు ఎంతవరకు నిజం అన్న విషయమై ఒక క్లారిటీ వస్తుంది.

అక్కడ నగశౌర్య తన పాత సినిమాలలో లాగా పెర్ఫార్మెన్స్ తో మార్కులు రాబట్టుకుంటే తప్ప అతనికంటూ ప్లస్ అయ్యే సూచనలేం లేవు. ఎందుకంటే ముద్ద పప్పు ఆవకాయ అనే ఒకే ఒక్క యూ ట్యూబ్ సిరీస్ లోనే నిహారిక నటన లో తన సత్తా ఏమిటో చూపించింది.. ఇక సినిమా విడుదలయ్యాక కూడా అంతా నిహారిక ని చూడటానికే ఆసక్తి చూపిస్తారు తప్ప నాగశౌర్య కోసం కాదు.

అయితే తన నటన లో ఉండే ప్రతిభతోనే శౌర్యకి తానేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఒక మనసు లో మార్కులు పడితే మాత్రం నాగశౌర్య గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందన్నది మాత్రం నిజం.. అసలు సంగతి తేలాలంటే జూన్ 24 దాకా వెయిట్ చేయక తప్పదు...

English summary
Buzz is that Nagababu's daughter Niharika is Dominating Hero Nagasaurya of the Movie "okamanasu"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu