»   » నాని కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను: ‘నిన్ను కోరి’ వెనుక ఇంత కష్టం ఉందా

నాని కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను: ‘నిన్ను కోరి’ వెనుక ఇంత కష్టం ఉందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

"దానయ్యగారు, కోనగారు, శివ, కార్తీక్‌, ప్రవీణ్‌, చిన్నా మా యాక్టర్స్‌ అందరికీ థాంక్స్‌. కొన్ని సినిమాలు చూసి అక్కడే వదిలేస్తారు. ఈ సినిమాని ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారు. ఇది నిజం కాకపోతే అందరికీ అడిగే హక్కు వుంటుంది. ఆ ఛాన్స్‌ ఎవరికీ రాదు. నేను ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయి చేసిన సినిమా ఇదే" మొన్న జరిగిన "నిన్ను కోరి" ప్రీ రిలీజ్ ఫక్షన్ లో నాని చెప్పిన మాటలివి. నిజానికి నాని తన అనుభవాన్నే చెప్పాడు. మూడు సంవత్సరాలుగా ఆ కథని తనకోసమే ఆపుకుంటూ వస్తున్నాడట ఈ నేచురల్ స్టార్.

శివ నిర్వాణ

శివ నిర్వాణ

ఈ చిత్రంతో శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.తన కథతో కొన్నేళ్ల పాటు ట్రావెల్ చేసి.. అనేక ప్రయత్నాల తర్వాత అది తెరమీదికి వచ్చినపుడు ఉద్వేగం మరింతగా ఉంటుంది. ‘నిన్ను కోరి' ఆ కోవలోని కథే. ఈ కథను నానికి శివ చెప్పి చాలా కాలమే అయింది.


మూడేళ్ళ కిందటే

మూడేళ్ళ కిందటే

దాదాపు మూడేళ్ళ కిందటే నాని దగ్గరికి ఈ కథ తో వచ్చాడట శివ. కానీ అప్పటికి నానీ కెరీర్ ధారుణమైన ఒడిదుడుకుల్లో ఉంది. ఆహా కళ్యాణం, పైసా లాంటి డిజాస్టర్లతో నాని కెరీరే ప్రశ్నార్థకంగా ఉన్న సమయం అది, ఆ టైం లో కథ నచ్చినా నాని ని నమ్మి ‘నిన్ను కోరి'ని పట్టాలెక్కించే నిర్మాత దొరకలేదు.


కథ బాగా నచ్చడంతో

కథ బాగా నచ్చడంతో

కానీ నాని కి ఆ కథని వదులుకోవాలనిపించలేదు. కథ బాగా నచ్చడంతో శివను వేరే హీరోల దగ్గరికి వెళ్లకుండా ఆపాడట నాని. ఎప్పటికైనా ఆ సినిమా తానే చెయ్యాలన్న కోరికతో శివ ని మూడేళ్ళ పాటు ఆపాడు. ఆ తర్వాత వచ్చిన సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం' సక్సెస్‌తో నాని కొంచెం ఊపిరి పీల్చుకోవడం.. ఆపై ‘భలే భలే మగాడివోయ్'తో నిలదొక్కుకోవడంతో. నిన్ను కోరి తీయాలనుకున్నా తర్వాత వరుసగా కమిట్మెంట్లు ఇవ్వడం. అవన్నీ పూర్తవటానికి ఇన్నళ్ళు పట్టింది.


సక్సెస్ అయితే

సక్సెస్ అయితే

ఇప్పుడు నాని అనే పేరుకే కొంత మార్కెట్ ఏర్పడింది నాని సినిమా అన్న మార్క్ కే సగం క్రేజ్ వస్తోంది. చివరికి పోయినేడాది డీవీవీ దానయ్య-కోన వెంకట్ సంయుక్త నిర్మాణంలో ‘నిన్ను కోరి'ని పట్టాలెక్కించడం జరిగింది. మొత్తానికి ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి నానికి అంతగా కనెక్టయిన కథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూద్దాం. శివ కి కూడా ఒక బ్రేక్ వచ్చే సినిమా గా నిన్ను కోరి సక్సెస్ అయితే అంతకన్నా కావాల్సిందేముంది..


ఆయన కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను

ఆయన కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను

"6, 7 సంవత్సరాలుగా నాని నా కథలతో జర్నీ చేస్తూనే వున్నాడు. ఫైనల్‌గా ఈ సంవత్సరం నానితో సినిమా కుదిరింది. ఆయనతో ఎక్కడో ఏదో ఒక ఎమోషనల్‌ కనెక్షన్‌ వుండేది. ఈ కథ నానికి చెప్పినప్పుడు ఆయన కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను. నానికి ఈ కథ నచ్చిందని అర్థమయ్యింది.


చాలామందిని కదిలించాయి.

చాలామందిని కదిలించాయి.

ఈ చిత్రంలో నాని నటించిన ఉమామహేశ్వరరావు క్యారెక్టర్‌, ఆది క్యారెక్టర్‌, నివేద క్యారెక్టర్‌ ప్రేక్షకులను కొన్నేళ్ల వరకు వెంటాడుతూనే వుంటాయి. ముగ్గురూ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్‌ అయి నటించారు."అంటూ శివ నిర్వాణ మాటలు కూడా చాలామందిని కదిలించాయి.English summary
Is Nani's Ninnu Kori Three Years Older story? Behind the Movi Ninnu kori is very moving
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu