»   » ప్లాపు హీరోలకు... పవన్ కళ్యాణే దిక్కయ్యాడా?

ప్లాపు హీరోలకు... పవన్ కళ్యాణే దిక్కయ్యాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్లో సరికొత్త ట్రెండు మొదలైందా? ప్లాపు హీరోలకు పవన్ కళ్యాణే దిక్కయ్యాడా? పవన్ కళ్యాన్‌ను వాడేసుకోవడం ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంటుగా మారిందా? అంటే అవునని నమ్మకతప్పడం లేదు ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే.

ఆ మధ్య వరుస ప్లాపులతో సతమతమైన హీరో నితిన్ పవన్ కళ్యాణ్ జపం చేయడంతో పాటు, తన సినిమాలోనూ ఆయన పేరును, ఇమేజ్‌ను వాడుకుని ప్లాపుల వరదలో మునిగి పోకుండా ఒడ్డుకు చేరాడు. ఆ తర్వాత పలువురు హీరోలు సెంటిమెంటుగా పవన్ కళ్యాన్ పేరును, గబ్బర్ సింగ్ సినిమాలోని సీన్లను, పాటలను వాడుకున్నారు.

తాజాగా మాస్ మహరాజ రవితేజ కూడా తన తాజా సినిమా 'బలుపు'లో పవన్ కళ్యాణ్‌ని వాడేసుకున్నాడు. 'బలుపు' సినిమా హిట్ టాక్ రావడంతో హిట్ క్రెడిట్ కాస్త పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లి పోయింది. వాస్తవానికి ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్‌‌ పేరుతో అవసరం లేకున్నా సెంటిమెంటుగా ఆయన పేరును వాడుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.

పవన్ సెంటిమెంటు బాగా వర్కౌట్ అవుతుండటంతో ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. త్వరలో రాబోయే మరిన్ని సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగబోతోందని సమాచారం. మరి ఈ ట్రెండు ఎంత కాలం కొనసాగుతుందో? చూడాలి. ఇలాంటి సెంటిమెంటు టాలీవుడ్లో కొనసాగడంపై పవన్ కళ్యాన్ ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు కానీ... ఆయన అభిమానులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు.

English summary
Tollywood industry was quick to point out that Pawan Kalyan’s song worked as a lucky charm for the movie. Now, Ravi Teja has gone a step ahead. Not only did he use a song from Gabbar Singh, he also used visuals of Pawan Kalyan in Balupu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu