»   » న్యూలుక్‌తో ప్రభాస్.. ముంబైలో వెంటాడిన మీడియా.. చివరికి.

న్యూలుక్‌తో ప్రభాస్.. ముంబైలో వెంటాడిన మీడియా.. చివరికి.

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రం తర్వాత తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముంబైలో కాలుపెట్టాడు. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోవడంతో ముంబై ఎయిర్ ‌పోర్ట్‌లో ప్రభాస్‌ను మీడియా వెంటాడినట్టు సమాచారం. మీడియా కంటిని తప్పించుకోవడానికి ప్రభాస్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదట. మీడియాకు చిక్కిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన చిత్రాలను మీకోసం..

న్యూలుక్‌తో ముంబైకి..

న్యూలుక్‌తో ముంబైకి..

బాహుబలి తర్వాత న్యూలుక్‌లో ముంబైకి చేరుకొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్న సాహో చిత్రాన్ని ముంబైలో ఎక్కువ భాగం షూట్ చేయనున్నారట. సాహో చిత్రం కోసం యూవీ క్రియేషన్స్ ముంబైలో ఆ ఆఫీస్‌ను కూడా తెరిచిన సంగతి తెలిసిందే. సాహో షూటింగ్ కోసమే ప్రభాస్ ముంబై చేరుకొన్నట్టు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించకపోవడం గమనార్హం. ముంబైలో ప్రభాస్‌ను మీడియా కంటపడకుండా ప్రయత్నించినట్టు సమాచారం.


నాజుకుగా తయారైన ప్రభాస్

నాజుకుగా తయారైన ప్రభాస్

బాహుబలి తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి అమెరికాకు వెళ్లిన ప్రభాస్ ఇటీవలనే తిరిగి వచ్చారు. సాహో కోసం శరీర బరువు తగ్గించుకొని చాలా సన్నపడినట్టు గతంలో వార్తలు రాగా.. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రభాస్ ఫొటోలు ఆ వార్తను ధ్రువీకరించాయి.


నీల్ నితిన్ ముఖేస్‌పై షూట్

నీల్ నితిన్ ముఖేస్‌పై షూట్

సాహో సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్‌లో విలన్ నీల్ నితిన్ ముఖేష్‌పై చిత్రీకరించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌కు ప్రభాస్ దూరంగా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ సంబంధించిన వివరాలను, హీరోయిన్ ఎంపిక వార్తను వెల్లడించనున్నారు.


అనుష్క ఎంపిక ఖారారు..

అనుష్క ఎంపిక ఖారారు..

సాహో కోసం ఇంకా హీరోయిన్ల ఎంపిక పూర్తి కానప్పటికీ.. ఇప్పటికే అనుష్కపై ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తున్నది. హీరోయిన్‌గా అనుష్క ఎంపిక ఖరారు అయినట్టు తెలుస్తున్నది. గతంలో బాలీవుడ్ హీరోయిన్ల కోసం ప్రయత్నించిన చిత్ర నిర్మాతలు చివరకు అనుష్కకే ఓటు వేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.


హాలీవుడ్ టెక్నీషియన్స్

హాలీవుడ్ టెక్నీషియన్స్

దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న సాహో చిత్రానికి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతికను వాడుతున్నట్టు తెలుస్తున్నది. యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.English summary
Prabhas recently returned from a long holiday in the US. He is ready begin shooting for Saaho in full swing. We can’t wait because Prabhas will be seen in a whole new avatar and it will be just as awesome. This time, the star has gone in for a bad-ass action avatar. We already caught a glimpse of it in the teaser, fans are now waiting for more. We also told you that Anushka Shetty has been confirmed as the female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu