»   » దొరికాక కూడా కబుర్లెందుకో ఒప్పుకోవచ్చుకదా..... బాలీవుడ్ హీరోయిన్ డేటింగ్

దొరికాక కూడా కబుర్లెందుకో ఒప్పుకోవచ్చుకదా..... బాలీవుడ్ హీరోయిన్ డేటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ ప్రేమపక్షుల జాబితాలో ఇప్పుడు మరో జంట చేరిపోయింది. ఆ జంట ఎవరో కాదు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్‌ తనయ సోనమ్ కపూర్ - ఆనంద్‌ అహూజా. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న నటి సోనమ్ కపూర్‌, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఆనంద్‌ ఆహూజా ఫొటోలు ఇదే చెప్తున్నాయని బాలీవుడ్‌ జనాలు అంటున్నారు. సోనం కపూర్‌ స్నేహితురాలి నిశ్చితార్థం ఇటీవల లండన్‌లో జరిగింది. ఈ సందర్భంగా సోనం, ఆనంద్‌ జంటగా వెళ్లిన ఫొటోలు బయటపడి.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. వారిద్దరూ ఫొటోల్లో కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రేమపక్షులుగా చెప్పబడుతున్న ఈ ఇద్దరి ఫొటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.

గతం లో అక్షయ్ కుమార్ రుస్తుం హిట్ సంద‌ర్భంగా అక్ష‌య్ త‌న స‌న్నిహితుల‌కు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి సోనమ్‌ కపూర్ దిల్లీకి చెందిన ఆనంద్‌ అహూజా అనే వ్యాపారవేత్తతో కలిసి ఆ పార్టీకి హాజరైంది. ఆనంద్‌కి ''భానే'' అనే సొంత దుస్తుల బ్రాండ్‌ ఉంది. సోనమ్‌ ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్లినా భానే బ్రాండ్‌ దుస్తుల్నే ధరిస్తుండటం ఇప్పుడు అక్షయ్‌ పార్టీకి అతనితో కలిసి ఒకే కారులో రావడంతో వీరిద్దరూ బీ-టౌన్‌ కొత్త ప్రేమజంట అని గుసగుసలు మొదలయ్యాయి.

Is Sonam Kapoor dating Anand Ahuja? She says no comment

అయితే రీసెంట్ గా బుధవారం ముంబైలో జరిగిన బ్రాండ్‌ విజన్‌ సమ్మిట్‌ 2016లో పాల్గొన్న సోనమ్ కపూర్ ను ఆనంద్‌తో బంధం గురించి ప్రశ్నించగా.. నో కామెంట్‌ అంటూ చెప్పింది. 'నా వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడాను. పదేళ్లుగా నేను ఇండస్ట్రిలో ఉన్నాను. నేను ఎప్పడు నా జీవితం గురించి చెప్పలేదు. నేనెప్పుడు అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు' అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రానున్న 'కాఫీ విత్‌ కరణ్‌'షోలోనైనా ఆనంద్‌తో డేటింగ్‌పై సోనమ్ నుంచి ఏమైనా వివరాలు రాబడుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
At Brand Vision Summit 2016 on Wednesday when Sonam was asked about her link-up with Anand Ahuja, the actor said, “I do not talk about my personal life. I have been in the industry for 10 years. I never speak about my personal life. I never answer it.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu