»   » రణ్‌వీర్‌కు గుడ్ బై.. మాజీ ప్రియుడి ఉహాల్లోనే దీపికా పదుకొనే!

రణ్‌వీర్‌కు గుడ్ బై.. మాజీ ప్రియుడి ఉహాల్లోనే దీపికా పదుకొనే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హీరో రణ్‌వీర్ సింగ్‌తో లవ్ అఫైర్ బ్రేక్ అయిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే చేసిన ట్వీట్ మరింత వివాదాన్ని రాజేస్తున్నది. హోళీ పండుగను పురస్కరించుకొని ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఫోటోను పెట్టి అభిమానులకు దీపిక శుభాకాంక్షలు తెలిపింది. ఇన్స్‌టాగ్రామ్‌లో రణ్‌బీర్ కపూర్ ఫోటోను పెట్టడం వివాదమైంది.

  రణ్‌బీర్ ఫొటో ట్వీట్

  రణ్‌బీర్ ఫొటో ట్వీట్

  దీపికా పదుకోనే ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలో ఉన్నది ప్రస్తుత లవర్ రణవీర్ సింగ్ కాకుండా మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ కావడం వివాదానికి కేంద్ర బిందువైంది. దాంతో రణ్‌వీర్‌తో బ్రేక్ అప్ అయిందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. గతంలో రణ్‌బీర్‌తో దీపిక పీకల్లోతు ప్రేమలో మునిగిన విషయం తెలిసిందే. రణ్‌బీర్ కుటుంబం అభ్యంతరం తెలుపడంతో వారి ప్రేమకు పుల్‌స్టాప్ పడిందనే వార్తలు అప్పట్లో వచ్చాయి.

  ఆ పాటనే దీపికకు ఇష్టమా..

  ఆ పాటనే దీపికకు ఇష్టమా..

  రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే ఇద్దరు యే జవానీ హై దివానీ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో హోళీ నేపథ్యంలో సాగే పాటకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. హోళీ పాటల్లో ‘బలం పిచ్‌కారీ' పాటకు ప్రత్యేక ప్రధాన్యం ఏర్పడింది. ఆ పాటలో దీపిక, రణ్‌బీర్‌ల కెమిస్ట్రీ అదుర్స్ అనే రేంజ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

   రాంలీలాలో రణ్‌వీర్, దీపికాల హోళీ

  రాంలీలాలో రణ్‌వీర్, దీపికాల హోళీ

  రణ్‌బీర్‌తో బ్రేక్ అప్ తర్వాత రణ్‌వీర్ సింగ్‌తో దీపికా ప్రేమలో పడింది. రాంలీలా చిత్రంలో వారిద్దరి జోడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. లాహూ ముహ్ లగ్ గయా అనే పాటలో రంగులు అద్దుకొని రణ్‌వీర్, దీపికా చేసిన శృంగారం తెరపైన బాగా పండింది. ఈ రెండు పాటలు హోళీ నేపథ్యమున్నవే.

   బ్రేకప్ తర్వాత రణ్‌బీర్ ఊహాల్లో..

  బ్రేకప్ తర్వాత రణ్‌బీర్ ఊహాల్లో..

  ఈ రెండు పాటల్లో రణ్‌బీర్‌తో కలిసి చిందేసిన బలం పిచ్‌కారీ పాట చిత్రాలను ఇటీవల హోళీని పురస్కరించుకొని దీపిక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌ను చూసిన కొందరు ఇంకా రణ్‌బీర్ ఊహల్లోనే బతుకుతున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రణ్‌వీర్‌కు దూరమైన కారణంగానే రాంలీలా పాటను ట్వీట్ చేయలేదని అంటున్నారు.

  బ్రేకప్‌కు విన్ డిజిల్ కారణం

  బ్రేకప్‌కు విన్ డిజిల్ కారణం

  గాఢమైన ప్రేమలో మునిగి తేలిన దీపిక, రణ్‌వీర్‌లు దూరంగా ఉండటానికి హాలీవుడ్ నటుడు విన్ డిజిల్ కారణమట. హాలీవుడ్‌లో ప్రవేశించిన దీపిక ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ అనే చిత్రంలో విన్ డిజిల్‌కు జంటగా నటించింది.

   దుబాయ్ గొడవ పడ్డ రామ్ లీలా

  దుబాయ్ గొడవ పడ్డ రామ్ లీలా

  ట్రిపుల్ ఎక్స్ సినిమా షూటింగ్ సమయంలో విన్ డిజిల్‌కు సన్నిహితంగా మెలగడం రణ్‌వీర్‌కు రుచించలేదట. దుబాయ్‌లో న్యూఇయర్ జరుపుకోవడానికి వెళ్లిన సమయంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నదట. దాంతో వారి మధ్య దూరం పెరిగిందనే రూమర్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

   రణ్‌వీర్‌తోనే దీపికా.. ప్రియాంక

  రణ్‌వీర్‌తోనే దీపికా.. ప్రియాంక

  ఇదిలా ఉండగా దీపికా, రణ్‌వీర్ విడిపోలేదని కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వెల్లడించింది. రామ్ ఇంకా సీతతోనే ఉన్నాడనే వ్యాఖ్యలు చేసింది.

  English summary
  Rumours are rife that all is not well between Deepika Padukone and beau Ranveer Singh. And Deepika's Instagram post wishing her fans a happy Holi has added fuel to the fire. She chose a picture of her and ex boyfriend Ranbir Kapoor from the song Balam Pichkari.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more