For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కల్యాణ్‌పై త్రివిక్రమ్ ప్రయోగం చేస్తున్నాడా? మహేశ్‌బాబు మాదిరిగానే ఆ పాత్రలో..

  By Rajababu
  |

  సినిమాల ద్వారా కొంతైనా మంచి చెప్పాలని ప్రయత్నిస్తుంటారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన రూపొందించే చిత్రాల్లోని పాత్రలను ప్రభావవంతంగా తీర్చిదిద్దటంలో మాటల మాంత్రికుడు దిట్ట.

  pawan kalyan

  తాజాగా పవన్ కల్యాణ్‌తో రూపొందించే సినిమాలో పవన్ కల్యాణ్‌ది చాలా పవర్ పుల్ పాత్ర అనే విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఈ సినిమా గురించి రకరకాల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే అటు త్రివిక్రమ్ గానీ, పవన్ కల్యాణ్ గానీ ఈ విషయంపై పెదవి విప్పకపోవడంతో అవి గాసిప్‌గానే మిగిలిపోయాయి.

  సిద్దూగా మారోసారి

  సిద్దూగా మారోసారి

  ఖుషీ సినిమా నుంచి పవన్ కల్యాణ్‌కు అచ్చొచ్చిన పేరు సిద్ధూ. అత్తారింటికి దారేదిలో కూడా సిద్దూ పేరును వాడుకొన్నారు. పవన్ లేటెస్ట్ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర బుద్దుడిని ఆదర్శంగా తీసుకొని రూపొందించినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. పవన్ మాటల్లో దివ్యత్వం, శాంతి లాంటి అంశాలు ఉంటాయనేది వార్త సారాంశం. ఈ చిత్రంలో పవర్ స్టార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

  దైవత్వం, శాంతి ప్రవచనాలు..

  దైవత్వం, శాంతి ప్రవచనాలు..

  గతంలో వచ్చిన ఖలేజా సినిమాలో మహేశ్‌బాబుపై త్రివిక్రమ్ ప్రయోగమే చేశారని చెప్పవచ్చు. ప్రిన్స్‌ను ఓ దేవుడిగా చూపించే ప్రయత్నం చేశాడు కూడా. కానీ ఆ పాత్ర సరిగా డిజైన్ చేయకపోవడం, ఇతర కారణాల వల్ల ప్రేక్షకుల మదిలోకి చొచ్చుకోలేకపోయిందనే ఓ విమర్శ. గతంలో జరిగిన తప్పులు ఈ సారి జరుగుకుండా త్రివిక్రమ్ జాగ్రత్త పడుతున్నారట.

  పక్కాగా స్క్రిప్ట్..

  పక్కాగా స్క్రిప్ట్..

  పవన్ పోషించే పాత్రకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండా త్రివిక్రమ్ పక్కాగా స్క్రిప్ట్ రాసుకొన్నట్టు సమాచారం. జనసేన పార్టీకి బలంగా మారే విధంగా పవన్ తాజా చిత్రం ఉంటుందనే ఉహాగానాలు వెలువడుతుండటం ఈ రూమర్‌కు కొంత బలం చేకూరింది. రాజకీయాలపై సున్నితమైన విమర్శనాస్త్రాలను పవన్ సంధిస్తారనే అంశం ఇండస్ట్రీలో ప్రచారమవుతున్నది.

  మూడో బ్లాక్ బస్టర్ కోసం..

  మూడో బ్లాక్ బస్టర్ కోసం..

  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలచాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. పవన్ సరసన అను ఇమ్మానియేల్ , కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీరిపై ఇటీవల కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

  English summary
  Power Star Pawan Kalyan, Director Trivikram Srinivas's latest movie is under shooting with high speed. Now Shooting going at Ramoji Film city of Hyderabad. In this movie Trivikram designs pawan characher with special mode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X