For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందుకే అనారోగ్యం : ఇషా ఛావ్లా

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఇషా ఛావ్లా రీసెంట్ గా అనారోగ్యం పాలై సునీల్ హీరోగా చేస్తున్న తను వెడ్స్ మను రీమేక్ షూటింగ్ లో పాల్గొనలేదు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ..తను కంటిన్యూగా షూటింగ్ లలో పాల్గొనటం,వైరల్ ఫీవర్ రావటంతో పాల్గొనలేకపోయానని అంది. బాలకృష్ణతో చేసిన శ్రీమన్నారాయణ,సునీల్ చిత్రం,కన్నడ విరాట్ చిత్రాల కోసం రాజమండ్రి,స్విజ్జర్ ల్యాండ్, పొల్లాచ్చి కంటిన్యూగా తిరిగానని దాంతో రెస్ట్ లెస్ గా శరీరం అయిపోయి అనారోగ్యానికి గురి అయ్యానని వివరించింది. అక్టోబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ లలో పాల్గొంటానని చెప్పుకొచ్చింది.

  ఇంతకుముందు చేసిన చిత్రాలతో గుర్తింపు వచ్చినప్పటికీ, 'శ్రీమన్నారాయణ' నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. ఒక పెద్ద సినిమా చేయడంవల్లే ఈ గుర్తింపు అంటూ ఆనందంతో చెప్పుకొచ్చింది. ఇక ఒక సీనియర్ ఆర్టిస్ట్ నుంచి అప్‌కమింగ్ ఆర్టిస్ట్ అభినందనలు అందుకుంటే ఆ ఆనందమే వేరు. 'ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్' అని బాలకృష్ణగారు ఇచ్చిన కాంప్లిమెంట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. బాలకృష్ణగారు పెద్ద హీరో అయినప్పటికీ అందరితో స్నేహంగా ఉండటం మాత్రమే కాదు ప్రోత్సహించడం గొప్ప విషయం. ఈ చిత్రంలో మాస్ సాంగ్స్ చేశాను అన్నారు ఇషాచావ్లా. ప్రేమకావాలి, పూలరంగడు తర్వాత నటించిన చిత్రం 'శ్రీమన్నారాయణ'. ఈ చిత్రం కూడా హిట్ కాబట్టి, 'హ్యాట్రిక్ కొట్టావ్' అని అంటున్నారు అని చెప్పుకొచ్చింది.

  సునీల్‌, ఇషా చావ్లా కాంబినేషన్ లో 'తను వెడ్స్‌ మను' రీమేక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గతంలో 'రాధాకృష్ణుడు' అనే టైటిల్ పెట్టారు. అయితే ఇప్పుడు మిస్టర్ పెళ్లి కొడుకు గా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టైటిల్ క్యాచిగా ఉండి,సబ్డెక్టుని రిప్రెజెంట్ చేస్తుందని ఈ టైటిల్ ప్రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి గతంలో బ్లేడ్ బాబ్జీ వంటి కామెడీ చిత్రం అందించిన దేవీ ప్రసాద్‌ దర్శకుడు. ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌ నిర్మాతలు.

  ఇటీవలే గోదావరి తీరంలో సన్నివేశాల్ని చిత్రీకరించి..రష్యాలో పాటలు చిత్రించబోతున్నారు. హిందీలో విజయవంతమైన 'తను వెడ్స్‌ మను' చిత్రానికి రీమేక్‌ కావటంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. 'సునీల్‌ శైలి వినోదం పూర్తిస్థాయిలో ఉన్న చిత్రమిది. మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలో పలు మార్పులు చేశాం. దేవీప్రసాద్‌ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్న విధానం ఆకట్టుకుంటుంద''ని చిత్ర వర్గాలు తెలిపాయి. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం సునీల్‌ సినీఖాతాలో ఇంకో హిట్‌ను నమోదు చేసుకుంటుందన్న అభిప్రాయాన్ని దర్శక, నిర్మాతలు వ్యక్తంచేస్తున్నారు. ఈ చిత్రంలో అలీ, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, కాశీ విశ్వనాథ్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సమర్పణ: ఆర్‌.బి.చౌదరి.

  English summary
  
 Isha Chawla, who has been down with viral fever, is all set to resume shooting from October 1 onwards. The actress fell ill due to her continuous shooting schedules and all the travelling without any breaks.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X