»   » పవన్ మాజీ భార్య కష్టానికి ప్రతిరూపం... ఇన్నాళ్లకి మోక్షం! (ఫోటోస్)

పవన్ మాజీ భార్య కష్టానికి ప్రతిరూపం... ఇన్నాళ్లకి మోక్షం! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత దర్శకత్వం, సినిమా నిర్మాణం వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠి చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగినా... పలు కారణాలతో సినిమాను ఇప్పటికీ విడుదల కాలేదు.

2014లోనే మరాఠీలో 'ఇష్క్ వాలా లవ్' చిత్రం విడుదల కాగా.... దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రం తెలుగులో వస్తోంది. అది కూడా థియేటర్లో కాదు....టీవీలో. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ఈటీవీ కొనుగోలు చేసింది.

ఈ సినిమా రిలీజ్ విషయమై ఈటీవీ నుండి కన్ఫర్మేషన్ వచ్చిందని, సెప్టెంబర్ 4న సినిమా రిలీజ్ అవుతోందని రేణు దేశాయ్ ప్రకటించారు. అకీరా నటించిన తొలి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం చాలా సంతోషంగా ఉందని ఆమె ప్రకటించారు.

తెలుగులో థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడం సాధ్యం కాలేదు. అందుకు కారణాలు ఏమిటనేది ఇప్పటికీ తెలియదు. అయితే కనీసం బుల్లితెర ద్వారా అయినా అకీరా తొలి సినిమా చూసే అవకావం దక్కడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఈ సినిమా కోసం ఆమె ఎంత కష్టపడ్డారు అనేది ఫోటోల రూపంలో....

పవన్ కళ్యాణ్ సహాయం

పవన్ కళ్యాణ్ సహాయం

కాగా...ఈ చిత్రం ఈ టీవీ వారు కొనుగోలు చేయడం వెనక పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఉందని అంటున్నారు. రామోజీరావుకు పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్ కావడంతో ఆయనే స్వయంగా మాట్లాడి డీల్ సెట్ చేసారని అంటున్నారు.

రేణు దేశాయ్

రేణు దేశాయ్

ఏది ఏమైనా రేణు దేశాయ్ దర్శకత్వం టాలెంట్ ఏలా ఉంటుందో స్వయంగా సినిమా చూసి తెలుసుకునే అవకాశం వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె ఇప్పటి వరకు కేవలం నటిగా, పవన్ కళ్యాణ్ భార్యగా మాత్రమే పరిచయం, ఈ సినిమా ద్వారా ఆమెలోని దర్శకురాలిని చూడబోతున్నారు.

అకీరా కోసమే

అకీరా కోసమే

ఆక్తికర విషయం ఏమిటంటే పవన్ తనయుడు అకీరా నటించిన తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అకీరా ఇందులో ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు.

ఇష్క్ వాలా లవ్

ఇష్క్ వాలా లవ్

'ఇష్క్ వాలా లవ్' బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేసారు.

విడిపోయినా..

విడిపోయినా..

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ సామరస్య పూర్వకంగా విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. తమ పిల్లల బాగోగుల విషయంలో ఇద్దరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నారు.

హీరో హీరోయిన్లతో

హీరో హీరోయిన్లతో

ఇష్క్ వాలా లవ్ హీరో హీరోయిన్లతో దర్శకురాలు రేణు దేశాయ్. మారిషస్‌లో షూటింగ్ జరుగుతుండగా ఈ ఫోటో తీసారు. రేణు దేశాయ్ వెంటే ఆమె కూతురు ఆద్య కూడా ఉన్నారు.

స్క్రిప్టు

స్క్రిప్టు

దర్శకురాలిగా మారిన రేణు దేశాయ్ సినిమా షూటింగుకు ముందు స్క్రిప్టులో మార్పులు చేస్తుండగా హీరో ఆదినాథ్ ఈ ఫోటో తీసారు.

వర్క్ ప్లేసులో

వర్క్ ప్లేసులో

ఇష్క్ వాలా లవ్ చిత్రం షూటింగ్ సెట్లో కెమెరా పనితీరును పరిశీలిస్తున్న దర్శకురాలు రేణుదేశాయ్.

సెల్ఫీ

సెల్ఫీ

ఇష్క్ వాలా లవ్ చిత్రంలోని ఓ సాంగ్ రికార్డింగ్ సందర్భంగా హీరో ఆదినాథ్, సింగర్ మోహిత్ చౌహాన్ లతో కలిసి ఇలా సెల్ఫీ ఫోటో దిగారు.

పవన్ మాజీ భార్య కష్టానికి ప్రతిరూపం

పవన్ మాజీ భార్య కష్టానికి ప్రతిరూపం

ఎస్ జె సూర్య స్వర పరిచిన డాన్స్ నంబర్ రికార్డింగ్ సందర్భంగా సింగర్స్ అభిజీత్ సావంత్, నేహ రాజ్ పాల్, కీర్తి కిల్లెదార్ లతో కలిసి రేణు దేశాయ్.

మారిషస్

మారిషస్

మారిషస్‌లో షూటింగ్ మొదలైన సందర్భంగా రేణు దేశాయ్ ఇలా తన ఫోటోను సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసారు.

అసిస్టెంట్స్

అసిస్టెంట్స్

ఇష్క్ వాలా లవ్ షూటింగ్ సందర్భంగా తన అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి రేణు దేశాయ్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

హీరోయిన్ తో

హీరోయిన్ తో

ఇష్క్ వాలా లవ్ షూటింగ్ సందర్భంగా హీరోయిన్ సులగ్నాతో కలిసి రేణు దేశాయ్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

హీరో హీరోయిన్

హీరో హీరోయిన్

హీరో ఆదినాత్, రేణు దేశాయ్, సులగ్నా మారిషస్‌లో షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రచయిత

రచయిత

పాటల రచయిత గురుతో కలిసి రేణు దేశాయ్. ఈ సినిమా కోసం ఆయన 4 పాటలు రాసారు.

English summary
"Hi,ETV has confirmed the telecast date of Ishq Wala Love(Telugu)for 4th September. Finally we will get to see Akira's mini debut on screen" Renu Desai said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu