»   » ఈటీవీతో రేణు దేశాయ్ డీల్... వెనక పవన్ కళ్యాణ్?

ఈటీవీతో రేణు దేశాయ్ డీల్... వెనక పవన్ కళ్యాణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత దర్శకత్వం, సినిమా నిర్మాణం వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠి చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగినా... పలు కారణాలతో సినిమాను ఇప్పటికీ విడుదల కాలేదు.

పవన్ కోసం రేణు దేశాయ్ త్యాగం...

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రం తెలుగులో వస్తోంది. అది కూడా టీవీలో. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ఈటీవీ కొనుగోలు చేసిందని ఆమె ప్రకటించారు. గతంలో ఈ సినిమా విడుదల సమయంలో తాను అనారోగ్యం పాలవ్వడం వల్ల అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేక పోయాం. కానీ ఇపుడు ఈ సినిమా త్వరలో ఈ టీవీలో రాబోతోంది. త్వరలోనే డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.

Ishq Wala Love Telugu version on Etv

కాగా...ఈ చిత్రం ఈ టీవీ వారు కొనుగోలు చేయడం వెనక పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఉందని అంటున్నారు. రామోజీరావుకు పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్ కావడంతో ఆయనే స్వయంగా మాట్లాడి డీల్ సెట్ చేసారని అంటున్నారు. ఏది ఏమైనా రేణు దేశాయ్ దర్శకత్వం టాలెంట్ ఏలా ఉంటుందో స్వయంగా సినిమా చూసి తెలుసుకునే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ సామరస్య పూర్వకంగా విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. తమ పిల్లల బాగోగుల విషయంలో ఇద్దరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నారు.

Ishq Wala Love Telugu version on Etv

ఆక్తికర విషయం ఏమిటంటే పవన్ తనయుడు అకీరా నటించిన తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అకీరా ఇందులో ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. 'ఇష్క్ వాలా లవ్' బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేసారు.

English summary
Renu Desai has announced to release Ishq Wala Love directly in TVs and the satellite rights were sold to ETV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu