»   » నాగ్, మహేష్‌ మల్టిస్టారర్...ఐశ్వర్యారాయ్ కన్ఫర్మేషన్

నాగ్, మహేష్‌ మల్టిస్టారర్...ఐశ్వర్యారాయ్ కన్ఫర్మేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : నాగార్జున, మహేష్‌బాబు కలయికలో మల్టీస్టారర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తారని, ఐశ్వర్యరాయ్‌ ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తుందని బాలీవుడ్‌ మీడియా గత రెండు రోజులుగా అంటోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుందని ఐశ్వర్యారాయ్ కన్ఫర్మ్ చేసినట్లుగా చెప్తున్నారు. బాలీవుడ్ మీడియా చెప్పేదాని ప్రకారం...ఐశ్వర్యారాయ్ ఈ క్రింద విధంగా మాట్లాడింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఐశ్వర్యారాయ్ మాట్లాడుతూ... ''గతేడాది మణిరత్నం సినిమాలో నటించాల్సింది. అసలు ఆ సినిమాతోనే నా వెండితెర పునరాగమనం జరగాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమైంది. ఈ లోగా మణిరత్నంగారు 'ఒకే కణ్మణి' (తెలుగులో 'ఓకే బంగారం') చేశారు. మళ్లీ ఈ మధ్యే ఆయన నాతో మాట్లాడారు.

Ishwarya Rai confirms ...Maniratnam, Mahesh Project?

గతేడాది చేద్దామనుకున్న సినిమా గురించి ప్రస్తావించారు. ఆయనతో సినిమా చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. ఆయన తీసిన 'ఇద్దరు'తో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆయనతో ఇప్పుడు మళ్లీ చేస్తే ఒక జీవిత చక్రం పూర్తవుతుంది'' అని ఐశ్వర్య చెప్పినట్లు బాలీవుడ్‌ మీడియా రాసుకొచ్చింది. నిజానిజాలు మాత్రం తేలాల్సివుంది.

ఇక తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ మరో హీరోయిన్ గా చేయనుందని సమాచారం. నాగార్జున, ఐశ్వర్య జోడీ కట్టబోతోందని అంటున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని అంటున్నారు.

English summary
It is a Tamil/Telugu project that would also feature Nagarjuna, Mahesh Babu and Shruti Haasan in leading roles. Aishwarya confirms, “I had chosen Mani Ratnam’s film last year. That did not get made. Had it been made, it would have been my ‘comeback film’. For other technical reasons, he has delayed it. He spoke to me recently. He is revisiting it. He’s made his other small film in the meantime. Jazbaa happened to be the first, which I had already okayed.”
Please Wait while comments are loading...