For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ క్యారెక్టర్ గురించే అంతా డిస్కషన్.. అదే ఫీలింగ్.. కారణం పూరీ జగన్నాథ్

  |

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఇటీవలే విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్స్‌లో హవా సాగిస్తోంది. పూరి జగన్నాథ్ మాస్ మసాలా పవరేంటో చూపిస్తూ ఓ రేంజ్‌లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన 4 రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిన ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఖుషీ ఖుషీగా ఇస్మార్ట్ టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసింది. ఈ సందర్బంగా వేదికపై హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమదైన స్టైల్‌లో స్పీచ్‌తో ఆకట్టుకున్నారు.

  75 కోట్ల మార్క్.. ఇస్మార్ట్ ఎంజాయ్

  75 కోట్ల మార్క్.. ఇస్మార్ట్ ఎంజాయ్

  పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా జులై 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న ఇస్మార్ట్ శంకర్ ఇప్పటి వరకు 75 కోట్ల గ్రాస్ కెలెక్షన్స్ రాబట్టింది. ఈ ఆనందాన్ని సక్సెస్ సెలెబ్రేషన్స్ రూపంలో ఎంజాయ్ చేశారు యూనిట్ సభ్యులు.

  రెండు మంచి పనులు చేశానన్న పూరి

  రెండు మంచి పనులు చేశానన్న పూరి

  హీరో రామ్‌ను కలకడం, ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయడం అనేవి ఈ మధ్యకాలంలో నేను చేసిన రెండు మంచి పనులు. అశేష ప్రేక్షకాదరణ పొంది ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్‌బస్టర్ సాధించింది. సినిమా చూసి చాలా మంది మిత్రులు అప్రిషియేట్ చేయడం జరిగింది. రామ్ ఎనర్జీ ఈ సినిమాను నిలబెట్టింది. ఈ సినిమా సక్సెస్‌టూర్‌కు వెళ్ళినప్పుడు అందరి నుంచి మంచి రీసీవింగ్ చూశాము. అంతా రామ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవడం చూసి సంతోష పడ్డాము అని పూరి జగన్నాథ్ అన్నాడు.

  అలాగే ఫీల్ అయ్యా.. కారణం పూరి

  అలాగే ఫీల్ అయ్యా.. కారణం పూరి

  ఇక ఆ వెంటనే మాట్లాడిన హీరో రామ్ స్పీచ్ బాగా ఆకట్టుకుంది. సినిమా చూశాక ఎలా ఫీల్ అయ్యానో ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక కూడా అదే ఫీలింగ్ కలిగింది. నా పాత్ర ఇంత డిఫెరెంట్ గా, మరింత ఎనర్జిటిక్ గా ఉందంటే దానికి కారణం పూరీ గారు. నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి నన్ను డిఫరెంట్‌గా చూపించారు. ఈ సక్సెస్‌ను, నా మంచి కోరుకునే వారందరికీ డెడికేట్ చేస్తున్నాను. మణిశర్మగారి సంగీతం, హీరోయిన్స్ గ్లామర్ సినిమా సక్సెస్‌కు యాడ్ అయ్యాయి. సినిమాలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్ అని రామ్ పేర్కొన్నాడు.

  రామ్ చరణ్, రామ్ గోపాల్ వర్మ రియాక్షన్

  రామ్ చరణ్, రామ్ గోపాల్ వర్మ రియాక్షన్

  చాలా కాలం తరువాత హిట్ టేస్ట్ చూసిన పూరి జగన్నాథ్ పై, ఇస్మార్ట్ శంకర్ సినిమాపై రామ్ చరణ్, రామ్ గోపాల్ వర్మ లాంటి సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఇస్మార్ట్ విజయంపై ఛార్మి ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఆడియన్స్‌ని కలుస్తూ, సోషల్ మీడియా టచ్ ఇస్తూ తన సంతోషాన్ని వ్యక్త పరుస్తోంది ఛార్మి.

   ఇస్మార్ట్ శంకర్ మూవీ

  ఇస్మార్ట్ శంకర్ మూవీ

  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెరకెక్కించారు. చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించగా.. అందాల భామలు నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. నిధి, నభా గ్లామర్ డోస్ తెలుగు ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేసింది. పూరి జగన్నాథ్ సహా హీరో రామ్, హీరోయిన్లు నిధి, నభా ఇద్దరికీ ఈ సినిమా అందించిన విజయం టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

  English summary
  Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's high voltege action seens hilighted in this movie. This movie success celebration done in hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X