»   » ఆయనతో మరో అవకాశం: ఆనందంతో సమంత ట్వీట్!

ఆయనతో మరో అవకాశం: ఆనందంతో సమంత ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించడం అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఇక ఆయనతో చేసే అవకాశం మళ్లీ మళ్లీ వస్తే... వారి ఆనందం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా సమంత ఫీలింగ్ అలానే ఉంది. ఇప్పటికే మహేష్ బాబుతో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లో నటించని సమంత మరోసారి ఆయనతో నటించబోతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో త్వరలో తెరకెక్కబోయే ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా ఈ విషయంమై అపీషియల్ సమాచారం రాక పోయినా... మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సమంత సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘ఎగ్జైటింగ్ అనౌన్స్ మెంట్స్... ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు' అంటూ ట్వీట్ చేసింది. బ్రహ్మోత్సవం సినిమాలో తనను ఖరారు చేస్తూ ప్రకటన రానున్న నేపథ్యంలో ఆమె ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు.

వాస్తవానికి ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలో ఆమె నటిస్తుండటంతో కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేక పోయిందట. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు సమంతను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఈ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్ పాత్రకు ప్రణీతను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

It Is Again Samantha For Mahesh Babu

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం మహేష్ బాబు 90 రోజుల కాల్షీట్లు ఇచ్చారు. సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేసుకుంటున్నాడు. జులైలో సినిమా మొదలు పెట్టి డిసెంబర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Well! Here is a news to cherish for the fans of super hit on-screen couple, Samantha and Mahesh Babu. The duo is reportedly back again for Srikanth Addala's Brahmotsavam.
Please Wait while comments are loading...