»   » త్వరలో బాలయ్యతో 101వ సినిమా, ఇంతలో సాయిపై ఐటి దాడులు

త్వరలో బాలయ్యతో 101వ సినిమా, ఇంతలో సాయిపై ఐటి దాడులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: ప్రముఖ సినీ నిర్మాత సాయి కొర్రపాటి ఆఫీస్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మణికొండలోని వారాహి చలనచిత్రం ఆఫీస్‌పై ఐటీ అధికారులు రెండు బృందాలుగా సోదాలు నిర్వహించారు. సాయి కొర్రపాటి ఆదాయానికి సంబంధించిన పన్నులు సరిగా చెల్లించడం లేదని ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి అక్రమ ఆస్తులు లభించలేదని సమాచారం.

సాయి కొర్రపాటి సినిమాల విషయానికొస్తే... త్వరలో బాలయ్యతో(101)వ సినిమా ఆయన భారీ బడ్జెట్ తో 'రైతు' అనే సినిమా తీయబోతున్నారు. మరో వైపు ఆయన నిర్మించిన 'జ్యో అచ్చుతానంద' సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా పేరు తెచ్చుకోవడంతో మెల్లిమెల్లిగా కలెక్షన్లు పెరుగుతున్నాయి.

 Sai Korrapati

జ్యో అచ్చుతానంద సినిమాని తొలి నుంచి చివరి వరకూ ఫన్ చేస్తూ నడిపించాడు దర్శకుడు అయితే ఫన్ జరుగుతున్న సమయంలో కూడా తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని నిలపెట్టగలగిగాడు. అంతేకాని మైండ్ లెస్ కామెడీ చేయలేదు. లైట్ హార్టెడ్ గా సీన్స్ ని పేర్చుకుంటూ నడిపించేసాడు.

సినిమాలో అవసరాల చేసిన స్కీన్ ప్లే మ్యాజిక్ మనలని కట్టిపారేస్తుంది. ముఖ్యంగా కీ రోల్ ..జ్యో కథని హీరోలైన అన్నదమ్ములిద్దరూ వాళ్ల భార్యల ముందు ఎవరికి తోచినట్టుగా వాళ్లు చెబుతారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు అదే కథ మరో కోణంలో తెరపై కనిపిస్తుంది. ఆ లెక్కన ఒకే సన్నివేశాన్ని తెరపై మూడుసార్లు చూడాల్సొస్తుంది. కానీ మనకు ఎక్కడా బోర్ కొట్టనివ్వడు.

English summary
Income-Tax Officials on Wednesday evening conducted a sudden raid on leading Telugu producer Sai Korrapati's office Vaarahi Chalana Chitram in Manikonda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu