Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ustaad Bhagat Singh నిర్మాతలకు ఐటీ షాక్.. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో రైడ్స్!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్రనిర్మాణ సంస్థగా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రముఖ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా పనుల్లో బిజీగా ఉండగా సోమవారం రోజు హఠాత్తుగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరగడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాదులో ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గ్యాప్ లేకుండా సోదాలు నిర్వహించారు.
ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఈ సంస్థలో సంక్రాంతికి రెండు భారీ బడ్జెట్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది. ఇక ఈ రెండు సినిమాలను కూడా నైజాంలోనే సొంతంగా విడుదల చేసుకుంటుంది. అయితే ఈ క్రమంలో సంస్థపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఐటీ సోదాలు నిర్వహించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఉదయం 9 గంటలకు మైత్రి ఆఫీసుకు చేరుకొని GST సోదాలు మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే పలువురు ఎన్నారైలు కూడా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక పొలిటికల్ ఇన్వెస్ట్ మెంట్ లు కూడా మైత్రి మూవీ మేకర్స్ లో ఉంటాయని కూడా టాక్ వచ్చింది. ఇక ఈ సంస్థపై ఐటి ఫోకస్ చేస్తుందని గతంలో కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి.
ఇటీవల పూరి జగన్నాథ్ నిర్మించిన లైగర్ సినిమా వ్యాపారంలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు రాగా అధికారులు వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొందరైపై పలువురు రాజకీయ నాయకుల బ్యాక్ గ్రౌండ్లో బ్లాక్ మనీతో కూడా బిజినెస్ వ్యవహారాలు కొనసాగుతున్నాయి అని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలపై కూడా ఐటి ఫోకస్ చేసిందని టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా మైత్రి మూవీ మేకర్స్ పై సోదాలు నిర్వహించడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. మరి ఈ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.