»   » ‘బ్రూస్ లీ’ ఎఫెక్ట్: శ్రీను వైట్ల, దానయ్య, దిల్ రాజు ఇళ్లపై దాడి

‘బ్రూస్ లీ’ ఎఫెక్ట్: శ్రీను వైట్ల, దానయ్య, దిల్ రాజు ఇళ్లపై దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘బ్రూస్ లీ'. ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత డివివి దానయ్య, సంగీత దర్శకుడు తమన్ ఇళ్లపై దాడులు నిర్వహించారు. శ్రీను వైట్ల, డివివి దానయ్య ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయంపై కూడా ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్, చెన్నైలోని కార్యాలయాల్లో ఇంకా సాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలిసి రామ్ చరణ్ షాకైనట్లు సమాచారం.

ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాల విడుదల ముందు ఐటీ అధికారులు ఆ సినిమాకకు సంబంధించిన వారిపై దాడులు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇటీవల పులి సినిమా విడుదల సమయంలో కూడా ఐటీ అధికారులు హీరో విజయ్ ఇంటిపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.


‘బ్రూస్ లీ' చిత్రాన్ని దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.


 IT Rides at Director Srinu Vytla, Bruce Lee Producer Homes

రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు.


డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
IT Rides at Actor Vijay, Bruce Lee Producer DVV Danaiah Homes, House and offices. The Income Tax Department on Thursday conducted surprise searches at the houses and offices.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu