»   »  ‘బాహుబలి’ కాదు ఇది భర్తబలి: నిర్మాత

‘బాహుబలి’ కాదు ఇది భర్తబలి: నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమ చిత్రం ‘బాహుబలి' కాదని ఇది భర్తబలి అంటున్నారు నిర్మాత అనీల్ సుంకర. ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో మీకు ఇప్పటికే అర్దమయ్యే ఉంటుంది. ఆయన తన తాజా చిత్రం ‘జేమ్స్ బాండ్' గురించి ట్వీట్ చేస్తూ ఇలా ఫన్నీగా అన్నారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకు సిద్దమవుతోంది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటో ఇక్కడ చూడండి

Thanking all unit of JAMESBOND for their day night work in bringing a good product. Saw the final product. JAMESBOND will make u laugh 4sure.Its not BAHABALI but BARTHABALI.

Posted by Anil Sunkara on 20 July 2015

" గుడ్ ప్రొడక్టు తీసుకురావటానికి రాత్రింబవళ్లూ కష్టపడి పనిచేసిన జేమ్స్ బాండ్ యునిట్ అందరి కీ ధాంక్స్ . ఫైనల్ ప్రొడక్టు చూసాను. జేమ్స్ బాండ్ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తుంది. ఇది బాహుబలి కాదు భర్త బలి " అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్'. ‘నేను కాదు నా పెళ్లాం' ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలవుతుంది.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘'మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందింది. అల్లరి నరేష్ కామెడి ప్రేక్షకులకు మంచి కామెడి టానిక్ అవుతుంది. అలాగే సాక్షి చౌదరి చక్కగా నటించింది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్.

Baahubali

సాయికిషోర్ గారు చక్కగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతానందించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం'' అన్నారు.
కాపీనా?

ఒకప్పుడు హాలీవుడ్ నుంచి మాత్రమే సినిమాలు ఎత్తేవారు. ఇప్పుడు కాలం మారింది. గ్లోబులైజేషేన్ నేపధ్యంలో ప్రపంచం కుగ్రామంలాగ మారింది. దాంతో ఎక్కడెక్కడ వనరులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా సినిమావారికి ప్రపంచం సినిమా బాగా దగ్గరైపోయింది. దాంతో ఎత్తిపోతల పథకాలు ఎక్కువయ్యాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే అల్లరి నరేష్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుప్పు మంది.

It's not Baahubali..It's Bhartha Bali: ProducerIt's not Baahubali..It's Bhartha Bali: Producer

ఈ చిత్రం కొరియా చిత్రం "My Wife Is A Gangster" ఆధారంగా రూపొందుతోందని టాక్. ఈ సినిమాలో ...ఓ డాన్ కు ఓ అమాయికుడు కి మధ్య జరిగే కామెడీ తో రన్ అవుతుంది. 'జేమ్స్‌ బాండ్‌' కూడా అలాంటి కథే అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాలి. అలాగే..గతంలోనూ అల్లరి నరేష్..ఇదే బ్యానర్ లో చేసిన అహనా పెళ్లంట చిత్రం సైతం ఇదే సినిమా నుంచి తీసుకున్నది కావటం విశేషం.

ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూయూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ.

English summary
Anil Sunkara tweeted: " Thanking all unit of JAMESBOND for their day night work in bringing a good product. Saw the final product. JAMESBOND will make u laugh 4sure.Its not BAHABALI but BARTHABALI."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu