»   » రామ్ చరణ్,వైట్ల చిత్రంలో విలన్ క్యారక్టర్, సీన్స్ (ఫొటోలు)

రామ్ చరణ్,వైట్ల చిత్రంలో విలన్ క్యారక్టర్, సీన్స్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా వచ్చిన అజిత్ చిత్రం 'ఎన్నై అరిందాల్‌'(ఎంత వారుగానీ) చిత్రంలో విలన్ గా నటించిన అరుణ్‌ విజయ్‌ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో ఫైట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ మల్టిమిలియనీర్ పాత్రను చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా అతని లుక్ ని డిజైన్ చేసారు. ఈ సినిమాలో తనకు పెయిర్ ఎవరూ ఉండరని, కేవలం తను నెగిటివ్ రోల్ లో కనపడతానని చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అరుణ్‌విజయ్‌ మాట్లాడుతూ.... ఏ పాత్రలో నటించినా... ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో నటించడానికి ఇష్టపడతా. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి హీరోగా మాత్రమే నటించాల్సిన అవసరం లేదు. నెగటివ్‌ రోల్‌లో కూడా నటించొచ్చు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలోని తెలుగు చిత్రంలో నటిస్తున్నా. రాంచరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం స్టంట్‌మాస్టర్‌ అణల్‌ అరుసుచే పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఎక్కువ రిస్కుతో కూడిన సన్నివేశాల్లో నటిస్తున్నా. ఈ యాక్షన్‌ సన్నివేశాలు ఆశ్చర్యపరుస్తాయన్నారు.

ఇక రాంచరణ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు ప్రధాన పాత్రల్లో శీను వైట్ల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం అఫీషియల్ టీజర్ ని చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రం డి.వి..వి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. ఆ టీజర్ ని ఇక్కడ చూడండి.

స్లైడ్ షోలో అరుణ్ విజయ్ ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్

ఇతనుప మరెవరో కాదు

ఇతనుప మరెవరో కాదు

తెలగు,తమిళ చిత్రాల్లో రెగ్యులర్ గా కనిపించే క్యారక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ కుమారుడు.

హీరోగా విఫలం

హీరోగా విఫలం

విజయ్‌కుమార్‌కు వారసుడిగా వచ్చిన అరుణ్‌విజయ్‌ ప్రారంభంలో హీరో గా పలు ప్రయోగాలు చేసి విఫలయ్యారు.

ఫలితం లేదు

ఫలితం లేదు

నిన్నటి వరకు కూడా ఆయన హీరోగా పలు సాహసాలు చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల హృదయంలో చోటు సంపాదించలేకపోయారు.

తొలి సారిగా హిట్

తొలి సారిగా హిట్

దీంతో ఆయన కోలీవుడ్‌కు 'విలన్‌'గా మారారు. గౌతంమేనన్‌ దర్శకత్వంలో అజిత్‌ నటించిన 'ఎన్నై అరిందాల్‌' చిత్రంలో అరుణ విజయ్‌ తొలిసారిగా విలన్‌గా నటించి హిట్‌ సొంతం చేసుకున్నారు.

మంచి మార్కులే

మంచి మార్కులే

అంతేకాకుండా ఆయన నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. విలన్‌గా గుర్తింపు రావడంతో ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అరుణ్‌ విజయ్‌పై దృష్టి పెట్టింది.

నమ్మకం

నమ్మకం

తాజాగా రాంచరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో అరుణ్‌విజయ్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి నమ్మకాలు పెట్టుకున్నాడు.

క్లైమాక్స్ కోసమే...

క్లైమాక్స్ కోసమే...

రీసెంట్ గా క్లైమాక్స్ ని చిత్రీకరించినట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ కోసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు చెప్పుకుంటున్నారు.

ముఖ్యంగా

ముఖ్యంగా

ఈ చిత్రంలో చిరంజీవి కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల అఫీషియల్ గా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సంట్ మాస్టర్

సంట్ మాస్టర్

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు.

రామ్ చరణ్,వైట్ల చిత్రంలో విలన్ క్యారక్టర్, సీన్స్ (ఫొటోలు)

రామ్ చరణ్,వైట్ల చిత్రంలో విలన్ క్యారక్టర్, సీన్స్ (ఫొటోలు)


ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేయాల్సి ఉంది.

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Tamil actor Arun Vijay, who impressed everyone as a baddie in Ajith's 'Yentha Vaadu Gaanie', is playing a negative role in Ram Charan's upcoming film. Here is the look of Arun in this Sreenu Vaitla directorial. “I play a multimillionaire and I am given a certain look in the yet-to-be-titled movie. Having completed one schedule in Hyderabad, I can say it was an awesome experience sharing the screen with Ram Charan,” Arun says.
Please Wait while comments are loading...