»   » ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చి... 'జోక్ వేసా..నో సీరియస్' అంటున్నాడు

ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చి... 'జోక్ వేసా..నో సీరియస్' అంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తను కబాలి సినిమా వారు తన పోస్టర్ దొంగిలించారని చేసిన కామెంట్ కేవలం జోకే అని ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకోవద్దని బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కోరుతున్నాడు.

ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ.. "నాకు రజనీకాంత్ గారు అంటే ఓ మానవత్వం ఉన్న మనిషిగా నటుడుగా చాలా గౌరవం. నేను పోస్టర్ గురించి మాట్లాడింది ఓ జోక్ మాత్రమే. అది ఫ్యాన్ క్లబ్ చేసిన పోస్టర్ . అంతేకానీ అఫీషియల్ మాత్రం కాదు ," అని ఆయన చెప్పాడు.

ఆన్‌లైన్‌లో రజనీకాంత్‌ అభిమానులు విడుదల చేసిన 'కబాలి' పోస్టర్.. యాజటీజ్ గా ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'మదారి' చిత్రం పోస్టర్‌లాగా ఉండటంపై ఇర్ఫాన్ ఖాన్ స్పందించిన సంగతి తెలిసిందే. తమది చిన్న సినిమా అయినా, తమ సినిమా పోస్టర్‌ను దొంగలించి కబాలి కోసం వాడుకున్నారని ఆయన మంగళవారం విమర్శించారు. ఇప్పుడేమో ఇలా జోక్ వేసానని అంటున్నారు.

It was a joke: Irrfan Khan on Rajinikanth starrer Kabali poster comment

అయితే రజనీ ఫ్యాన్స్ గట్టిగా..ఇర్ఫాన్ ఖాన్ ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఆడుకున్నారు. దాంతో ఇలా దిగివచ్చారని తమిళ మీడియా వ్యాఖ్యానిస్తోంది. రజినీకాంత్‌ అభిమానులను ఇప్పుడు 'కబాలి' జ్వరం ఊపేస్తోంది. భారీ అంచనాలు ఏర్పడిన 'కబాలి' సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Did #rajanikanth film #kabali steal poster of #irfankhan film #madaari

A video posted by viral bhayani (@viralbhayani) on Jun 26, 2016 at 7:39pm PDT

ఆయన మాట్లాడుతూ..''మేమేదో చిన్న సినిమాలు తీసిన వాళ్లం.. అంత పెద్ద సినిమా తీస్తున్న వాళ్లు మా పోస్టర్ ను కాపీ కొట్టారు. అయినా ఓకే ,ఫర్వాలేదు, ఆ సినిమా పట్ల మాకెలాంటి నిరసనా లేదు. అందరూ ఆ సినిమాను చూడండి, ఎంజాయ్ చేయండి...'' అన్నాడు. ఈ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మన తెలుగు,తమిళంలో కూడా సినిమాలు చేసారు. ఆయన ఇంతమాట అనటానికి కారణం. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్టులు ప్రచురితం అవుతూ వస్తూండటమే.

English summary
Irrfan Khan said his statement that Rajinikanth's Kabali has stolen the poster of his upcoming film Madaari was a mere joke. “I respect Rajinikanth ji as a human and as an actor and what I said about the poster was a joke. I want to clarify that the poster which I talked about was made by one of his fan clubs,” Irrfan told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu