»   » ఆంధ్రాలో ‘నంది’ అవార్డులు.... తెలంగాణలో ‘సింహ’ అవార్డులు

ఆంధ్రాలో ‘నంది’ అవార్డులు.... తెలంగాణలో ‘సింహ’ అవార్డులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు తెలుగు సినిమాలకు సంబంధించి ప్రభుత్వం తరుపున 'నంది' అవార్డులు ఇచ్చే సంగతి తెలిసిందే. అయితే నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కావడంతో.... తెలంగాణ ప్రభుత్వం సపరేటుగా మరో అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఈ అంశంపై ఓ కమిటీని నియమించగా....రాష్ట తెలంగాణలో నిర్మించిన ఉత్తమ చిత్రాలు, ప్రతిభ చూపిన కళాకారులకు 'సింహ' పేరుతో పురస్కారాలివ్వాలని ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసింది. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, నిపుణుల కమిటీ ఆరు నెలలు విస్తృతస్థాయిలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం నలభై విభాగాల్లో ఈ అవార్డులు ఉండాలని కమిటీ సూచించింది. మొదటి విభాగంలో వాటికి రూ.అయిదు లక్షల నగదు పారితోషికం ఇవ్వాలని ప్రతిపాదించింది. తెలంగాణ ముద్ర చాటేలా ఈ చలనచిత్ర పురస్కారాలు ఉంటాయి. కమిటీ సిఫారసులతో కూడిన నివేదిక ప్రస్తుతం కేసీఆర్ వద్ద ఉంది. ఆయన వాటిని పరిశీలించి ఆమోద ముద్ర వేయగానే అఫీషియల్ గా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Its Simha Awards for Telangana Cinema

కమిటీ తమ నివేదికలో చేసిన సిఫార్సులు

*దేశంలోని ఉత్తమ సినీ కళాకారునికి ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం. రూ.5 లక్షల పారితోషికంతో స్వర్ణ సింహం
* నటులు కాకుండా ఇతర సినీ ప్రముఖుడికి పైడి జయరాజు పేరిట స్వర్ణసింహం, రూ.అయిదు లక్షలు
* తెలుగు సినీ ప్రముఖుడికి రఘుపతి వెంకయ్య పురస్కారం, స్వర్ణసింహం, రూ.అయిదు లక్షలు
* తెలంగాణ సినీ ప్రముఖుడికి కాంతారావు పురస్కారం, స్వర్ణసింహం, రూ. అయిదు లక్షలు

ఉత్తమ చిత్రాలకు
* ఉత్తమ చిత్రానికి రూ. అయిదు లక్షలు. నిర్మాతకు స్వర్ణసింహం, దర్శకుడు, కథానాయకుడు, కథానాయికకు సింహ పురస్కారాలు
* ద్వితీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు రజత సింహం, రూ.మూడు లక్షలు. దర్శకుడు, కథానాయకుడు, కథానాయికకు పురస్కారాలు
* తృతీయ ఉత్తమ చిత్ర నిర్మాతకు కాంస్య సింహం, రూ. రెండు లక్షల నగదు. దర్శకుడు, నాయకానాయికలకు పురస్కారాలు
* ఉత్తమ కుటుంబ చిత్రానికి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పురస్కారం: నిర్మాతకు స్వర్ణ సింహం, రూ. 2 లక్షల నగదు
* ఉత్తమ వినోదాత్మక చిత్రానికి స్వర్ణ సింహం, రూ.రెండు లక్షల నగదు
* జాతీయ సమగ్రతను చాటే చిత్రానికి సరోజిని నాయుడు పురస్కారం : నిర్మాతకు రూ.రెండు లక్షల నగదు, స్వర్ణసింహం, దర్శకుడికి తామ్ర పురస్కారం
* ఉత్తమ బాలల చిత్ర నిర్మాతకు స్వర్ణసింహం, రూ.రెండు లక్షల నగదు, దర్శకునికి రూ.లక్ష, తామ్ర సింహం
* ద్వితీయ ఉత్తమ బాలలచిత్ర నిర్మాతకు రూ.లక్ష, రజత సింహం, దర్శకుడికి రూ.50 వేలు
* బాలల చిత్రానికి ఉత్తమ దర్శకుడికి రూ. లక్ష, స్వర్ణ సింహం
* తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథానికి రూ.50 వేలు, తామ్ర సింహం
* తెలుగు సినిమాపై ఉత్తమ విమర్శకుడికి రూ.30 వేలు, తామ్ర సింహం

సినీకళాకారులు, సాంకేతిక నిపుణులకు..
* ఉత్తమ దర్శకుడు, కథానాయకుడు, నాయికకు స్వర్ణ సింహం, రూ.లక్ష చొప్పున నగదు
* సహాయ నటుడు, నటికి రూ.50 వేలు, స్వర్ణ సింహాలు
* హాస్యనటునికి తామ్ర సింహం, రూ. 50 వేలు
* ప్రతినాయకునికి స్వర్ణ సింహం, రూ. 50 వేలు
* బాల నటునికి స్వర్ణ సింహం, రూ. 50 వేలు
* ఉత్తమ తొలిచిత్రదర్శకుడు, నటుడు, నటికి రూ.50 వేలు, రజత సింహం
* ఉత్తమ కథారచయిత, మాటలు, పాటల రచయిత, సినిమాటోగ్రాఫర్‌కు స్వర్ణ సింహం, రూ. 50 వేల నగదు

చక్రి పేరిట

* ఉత్తమ సంగీత దర్శకునికి చక్రి పేరిట రూ. 50 వేలు, స్వర్ణ సింహం
* ఉత్తమ సంగీత దర్శకునికి చక్రి పేరిట రూ. 50 వేలు, స్వర్ణ సింహం
* ఉత్తమ నేపథ్యగాయకుడు, గాయనిలకు రూ.50 వేలు, స్వర్ణసింహం

ప్రత్యేక కేటగిరి పురస్కారాలు
* ఉత్తమ ఎడిటర్‌, కళాదర్శకుడు, నృత్యదర్శకుడు, ఆడియోగ్రాఫర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, మేకప్‌ ఆర్టిస్టు, స్టంట్‌ డిజైనర్‌, డబ్బింగు కళాకారుడు, కళాకారిణి, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ప్రత్యేక కేటగిరి పురస్కారాల కింద తామ్ర సింహాలు, రూ. 50 వేల చొప్పున నగదు

English summary
The Prestigious Nandi Awards have split into Nandi Awards for Andhra Pradesh and Simha Awards for Telangana government.
Please Wait while comments are loading...