»   » రహస్యంగా జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ పెళ్లి! (ఫోటోస్)

రహస్యంగా జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ పెళ్లి! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్ధస్త్ కార్యక్రమం ద్వారా పాపులర్ అయి వరుస సినిమా అవకాశాలతో దసుకెలుతున్న శంకలక శంకర్ వివాహం మీడియాకు, ఇండస్ట్రీ వారికి తెలియకుండా రహస్యంగా జరిగి పోయింది. శంకర్ తన మేనమామ కూతురు పార్వతిని వివాహం చేసుకున్నాడు.

తన తండ్రి మొక్కు కారణంగా అరసవల్లిలోని సత్యనారాయణ స్వామి సన్నిధిలో మూడు ముళ్ళు వేసినట్టు శంకర్ తెలిపారు. సహచర నటులెవరినీ ఆహ్వానించలేదన్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా చేసుకున్న శంకర్ మ్యారేజ్‌కి కేవలం బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు.

పెళ్ళి ఆర్భాటంగా చేసుకోవడం ఇష్టం లేదని .. సేవా కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని శంకర్ తెలిపాడు. తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ప్రణాళికలు కూడా సిద్దం చేసుకున్నట్టు వెల్లడించాడు శంకర్. తాను 10వ తరగతి వరకు గవర్నమెంటు హాస్టల్ లోఉండి చదువుకున్నాను. హాస్టల్ పిల్లల బాధలు నాకు తెలుసు..వారికి దుస్తులు, క్రికెట్ కిట్లు అందిస్తానని తెలిపారు.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నయని... ఇపుడు 15 సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. షూటింగ్ గ్యాపులో సింపుల్ గా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు. స్లైడ్ షో శకలక శంకర్ పెళ్లి ఫోటోస్...

వివాహం

వివాహం


శంకర్ తన మేనమామ కూతురు పార్వతిని వివాహం చేసుకున్నాడు.

ఎవరినీ పిలవలేదు

ఎవరినీ పిలవలేదు


సహచర నటులెవరినీ శంకర్ తన ఆహ్వానించలేదన్నారు.

రిసెప్షన్ కూడా లేదు

రిసెప్షన్ కూడా లేదు


పెళ్ళి ఆర్భాటంగా చేసుకోవడం ఇష్టం లేదని శంకర్ తెలిపారు. అంటే వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

జబర్దస్త్ ద్వారా

జబర్దస్త్ ద్వారా


జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన శంకర్ వరుస సినిమా అవకాశాలతో దూసుకెలుతున్నారు.

English summary
Comedian Shakalaka Shankar has finally made space for personal life and got married to his uncle’s daughter Parvati at the renowned Arasavilli temple, Srikakulam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu