»   » మళ్ళీ కోర్టులో హాజరైన జబర్దస్త్ టీం

మళ్ళీ కోర్టులో హాజరైన జబర్దస్త్ టీం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈటీవీలో ప్రసారం అవుతున్న బజర్దస్త్ టీంలోని నటులు శుక్రవారం హుజూరాబాద్ సబ్ కోర్టుకు హాజరయ్యారు. గతంలో 'జబర్దస్త్'లో ప్రసారమైన ఒక ఎపిసోడ్ న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈమేరకు ఒక పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే..'

జ‌బ‌ర్ధ‌స్త్ లో ఒకస్కిట్ లో న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదులు, భ‌గ‌వ‌త్ గీతను కించ‌ప‌రిచార‌ని ఆఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ప్ర‌సారాల్లో భ‌గ‌వ‌త్ గీత పై ప్ర‌మాణం చేయ‌మంటే ఒక్క‌ గీత కాదు నాలుగు గీత‌ల‌పై చేస్తానూ అంటూ భ‌గ‌వ‌త్ గీత‌ను కించ‌ప‌రిచారని కోర్టుకు విన్న‌వించారు.

Jabardasth Comedy Show Faces Court Case Again

ఈ అంశాల‌న్నింటిని పరిశీలించిన న్యాయ‌మూర్తి జ‌బ‌ర్ధ‌స్త్ టీం యాంక‌ర్లు అన‌సూయ‌, ర‌ష్మి, ప్రోగ్రామ్ జడ్జీ లు నాగేంద్ర‌బాబు, ఎమ్మెల్యే రోజా, ప్రోగ్రాం ప్రొడ్యూస‌ర్ శాంసుందర్ రెడ్డి తో పాటు క‌మెడియ‌న్లు ఫ‌ణి, ధ‌న్ రాజ్ లకు నోటీసులు జారీచేశారు.ఆ స్కిట్ లో పాల్గొన్న నటులనూ, నిర్వాహకులనూ,జడ్జీలనూ,యాంకర్ నూ హాజరు కావాల్సిందిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది అదే కేసు విశయం లో జబర్దస్త్ ఆర్టిస్టులంతా హుజూరూరాబాద్ కోర్టు లో హాజరయ్యారు.

శుక్రవారం పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వర్ రావు, ఫణి కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. అయితే నిర్మాత ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ, మిగతా నటుల తరఫున న్యాయవాది ముక్కెర రాజు పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణకై న్యాయమూర్తి కంచె ప్రసాద్ కేసును జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు....

English summary
Jabardasth team appeared before Huzurabad court in karim nagar Distrct of Telangana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu