»   » అర్ధరాత్రి ప్రభాస్ మిస్డ్‌కాల్స్‌ ఇచ్చాడంటూ...

అర్ధరాత్రి ప్రభాస్ మిస్డ్‌కాల్స్‌ ఇచ్చాడంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒక్కోసారి సరదా కోసం, వాతావరణం తేలిక చేయటంకోసం పెద్ద హీరోలు ప్రాక్టికల్ జోక్స్ చేస్తూంటారు. అలాంటి ప్రాక్టికల్ జోక్ ఒకటి తనపై ప్రభాస్ చేసారంటూ... ‘జబర్దస్త్‌' వేణు గుర్తు చేసుకున్నారు. ‘జై' సినిమాతో వెండితెరపై జైత్రయాత్ర ఆరంభించిన నవ్వుల గని వేణు. ‘ఔనన్నా కాదన్నా', ‘రణం', ‘మున్నా', ‘జగడం', ‘పిల్లజమిందార్‌', ‘రేసుగుర్రం', ‘అత్తారింటికి దారేది' ... దాదాపు 150 సినిమాల్లో నటించి నవ్వించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వేణు మాట్లాడుతూ... ప్రభాస్‌గారు హీరోగా నటించిన ‘మున్నా' షూటింగ్‌ లో రాత్రి దాదాపు 2 గంటల సమయంలో హైదరాబాద్‌ టోలీచౌక్‌ దగ్గరున్న డాక్‌ బంగ్లా టెర్రస్‌ పైన షూటింగ్‌ జరుగుతోంది. ఆ రోజు నేను ప్రభాస్‌గారికి ఫ్రెండ్‌గా నటించాను అందులో. ఆయన్ని ఉద్ధేశించి ‘‘రేయ్‌ .. పర్సనల్‌ లైఫ్‌ అంటే ఏమిటో తెలియకుండా పెరిగాం.

'Jabardasth' Fame Actor Venu about Prabhas Missed Calls

మాకోసం నువ్వూ, నీకోసం మేమూ కలిసి బతికాం - కలిసి బతుకుతాం'' అనే డైలాగ్‌ను సీరియస్‌గా చెప్పాలి. షాట్‌ రెడీ అయ్యింది. నేను డైలాగ్‌ చెప్పబోతుండగా జేబులోంచి ‘రింగ్‌'టోన్‌! రాత్రి రెండు గంటలకు ఫోనేంటా అని భయపడిపోయాను. డైలాగ్‌ చెప్పబోతున్న ప్రతిసారీ ఫోన్‌ రింగయ్యేది. ఆగిపోయేది. దాదాపు పది టేకులు తిన్నాను.

ఒకవైపు నిద్రమత్తు. మరోవైపు డైలాగ్‌ చెప్పాలి. ఫోన్‌ పక్కన పెడదామన్న ఆలోచన కూడా రాలేదు. పైగా కెమెరా ఫ్రేమ్‌లో నేనొక్కడినే కనిపించే సన్నివేశం అది. డైరెక్టర్‌ వంశీపైడిపల్లిగారు చిరాకు పడిపోయి అరవబోయేలోపు ప్రభాస్‌గారు గబగబ వచ్చి ‘‘నేనే సరదాగా మిస్డ్‌ కాల్స్‌ ఇప్పించాను'' అనేసరికి సీరియస్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

'Jabardasth' Fame Actor Venu about Prabhas Missed Calls

అందరూ పగలబడి నవ్వారు. షూటింగ్స్‌లో ఇలాంటి ఫన్నీ సంఘటనలు అప్పటికి చిరాకు కలిగిస్తాయికానీ, జీవితాంతం వెంటాడే తీపి గుర్తులుగా మిగిలిపోతాయి.

English summary
'Jabardasth' Fame Actor Venu remembers his days with Prabhas at 'Munna' Shooting.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu