సోనూ సూద్‌కి జాకీ చాన్ ఇచ్చిన న్యూఇయర్ గిఫ్టు (ఫోటో)
హైదరాబాద్: హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కుంగ్ ఫూ యోగా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఇండో-చైనీస్ చిత్రం. ఇందులో జాకీ చాన్ తో పాటు ఇండియన్ స్టార్స్ జాకీ చాన్, అమైరా దస్తూర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలోఉంది. ఈ ఏడాది చివరకల్లా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో జాకీ చాన్ కు సమానంగా సోనూ సూద్ పాత్ర ఉంటుందట. ఈ సినిమాకు స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం సోనూ సూద్ పలు బాలీవుడ్ ప్రాజెక్టులను వదులుకున్నాడు. ఈ సినిమా తర్వాత తనకు హాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నాడు.
కాగా... సోనూ సూద్ ఈ సారి న్యూఇయర్ వేడుకలను జాకీచాన్ తో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాకీ చాన్ నుండి జాకెట్ గిఫ్టుగా అందుకున్నారు. ఈ విషయాన్ని సోనూ సూద్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. జాకీ చాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు సోనూ సూద్.


Click it and Unblock the Notifications











