»   » క్యాసినోల్లో డబ్బు పొగొట్టుకోలేదు, వారు మోసం చేయడం వల్లే: జగపతి బాబు

క్యాసినోల్లో డబ్బు పొగొట్టుకోలేదు, వారు మోసం చేయడం వల్లే: జగపతి బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు ఇపుడు విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ తనలో విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'రంగస్థలం' చిత్రంలో జగపతి తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.

జగపతి బాబు నటన సంగతి పక్కన పెడితే... ఆయన గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. విదేశాల్లో జూదం ఆడతారని, క్యాసినోల్లో చాలా డబ్బు పోగొట్టుకున్నారని, అందు వల్లే ఆయన ఆస్తులన్నీ కరిగిపోయాయని అంటుంటారు. తాజాగా ఓ పత్రిక ఇంటర్వ్యూలో దీనిపై జగపతి బాబు స్పందించారు.

చాలా మంది మోసం చేశారు

చాలా మంది మోసం చేశారు

తాను కొన్ని కారణాల వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న మాట నిజమే, అయితే అందుకు కారణం తన లైఫ్ స్టైల్ అనే మాత్రమే కారణం కాదని, తన వద్ద డబ్బు తీసుకున్న ఎంతో మంది మోసం చేశారని... అలా ఆర్థికంగా దెబ్బతిన్నానని తెలిపారు.

ఆర్థికంగా ఆదుకున్నాను

ఆర్థికంగా ఆదుకున్నాను

తాను మోస పోవడానికి కారణం తన వైఫల్యమే అని, అదే విధంగా సినిమాల కారణంగా దెబ్బతిన్న ఎంతో మందిని ఆదుకున్నాను... అలా తన వద్ద ఉన్న డబ్బంతా పోయింది అని జగపతి బాబు వెల్లడించారు.

క్యాసినోల వల్లకాదు

క్యాసినోల వల్లకాదు

విదేశాల్లో తాను క్యాసినోలకు వెళ్లి జూదం ఆడటం వల్లే డబ్బును కోల్పోయినట్టు ప్రచారం ఉంది. అందులో ఏ మాత్రం నిజం లేదని జగపతి బాబు తెలిపారు.

 అపుడు డబ్బు విలువ తెలియలేదు

అపుడు డబ్బు విలువ తెలియలేదు

ఖర్చు పెట్టడానికే సంపాదించాలి, ఆనందంగా ఉండేందుకు డబ్బు కావాలన్నది నా సిద్ధాతం. గతంలో డబ్బు విలువ తెలియకుండా చాలా ఖర్చు చేశాను. ఇపుడు డబ్బు విలువు తెలుసుకుని ఖర్చు చేస్తున్నాను అని జగపతి బాబు తెలిపారు.

అంతా నా మంచికే

అంతా నా మంచికే

ఇప్పటి వరకు జరిగినదంతా నా మించి కోసమే అని నేను భావిస్తుంటాను. అలాంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం వల్లే ఇపుడు తాను ఎలాంటి పరిస్థితులనైన తట్టుకుని నిలబడే స్థితికి చేరుకున్నాను అన్నారు.

English summary
Jagapathi Babu About Financial Crisis And Casino Gambling. Jagapathi said that he did not lose money in Casino.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X