»   » జగపతి బాబు ‘పటేల్ సర్’ సెన్సార్ రిపోర్ట్

జగపతి బాబు ‘పటేల్ సర్’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకే పరిమితమైన జగపతి బాబు చాలా కాలం తర్వాత మళ్లీ హీరోగా కనిపించబోతున్నారు. ఆయన నటిస్తున్న పటేల్ సర్ మూవీ జులై 14న విడుదలకు సిద్ధమవుతోంది.

వారాహి స్టూడియోస్ బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాసు పరిమి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.


Jagapathi Babu Patel SIR Finished Censor Certification

తాజాగా 'పటేల్ సర్' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఎ సర్టిఫికెట్ పొందింది. జగపతి కెరీర్లో ఇదే ప్రత్యేకమైన సినిమా అవుతుందని అంటున్నారు. వారాహి వారి సినిమా కావడంతో ఈ సినిమాపై అంతా నమ్మకంగా ఉన్నారు.


బుల్లెట్‌పై స్టైలిష్‌గా వస్తూ ఏజ్ బారైన గ్యాంగ్‌స్టర్‌లా మెప్పించబోతున్నాడు. ఒంటి నిండా టాటూలు, తెల్లజుట్టు, గడ్డంతో స్టైలిష్ అండ్ రఫ్‌ లుక్‌తో జగ్గూభాయ్ ఇప్పటికే ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి డిజె వసంత్ సంగీతం అందిస్తున్నారు.


English summary
Jagapathi Babu’s re-entry as action hero with Patel SIR is releasing on July 14th. Directed by Vasu Parimi and produced by Sai Korrapati on Vaaraahi Chalana Chitram banner, the film finished censor formalities to receive U/A certification.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu