»   »  ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలో జగపతి వెరీ బ్యాడ్!

ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలో జగపతి వెరీ బ్యాడ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఈచిత్రంలో జగపతి బాబు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఇందులో జగపతి రోల్ విలనిజాన్ని తలపించేలా చెడ్డగా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ కు సరితూగేలా ధీటుగా ఉంటుందని టాక్.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం మే నెలలో సెట్స్ మీదనకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

Jagapathi Babu play as bad guy in NTR’s next

ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఫీషియల్ లాంచింగ్ ని యుకే లో చేస్తున్నట్లు సమాచారం. అక్కడ షూటింగ్ రెగ్యులర్ గా జరుపుతాం కాబట్టి అక్కడే లాంచింగ్ పెట్టుకుంటే మంచిదని ఈ నిర్ణయానికి దర్శక, నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1-నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అంటున్నారు నిర్మాత.

English summary
Jagapathi Babu play as bad guy in NTR’s next, which will be directed by Sukumar.
Please Wait while comments are loading...