»   »  పవన్ డుమ్మా, కేటీఆర్‌ సందడి: మాజీ ప్రధాని మనవడి 75 కోట్ల సినీ వేడక..(ఫోటోస్)

పవన్ డుమ్మా, కేటీఆర్‌ సందడి: మాజీ ప్రధాని మనవడి 75 కోట్ల సినీ వేడక..(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్‌'. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌ నోవాటెల్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవగౌడ తో కలిసి ఆయన బిగ్ సీడీ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ఇంకా టి.సుబ్బరామిరెడ్డి, జగపతిబాబు, విజయేంద్రప్రసాద్‌, సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ, డి.సురేష్‌బాబు, పుల్లెల గోపీచంద్‌, పి.వి.సింధు, ఎస్‌.ఎస్‌.థమన్‌, అశోక్‌కుమార్‌, బ్రహ్మానందం, రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు.


మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవగౌడ మాట్లాడుతూ - ''మా నిఖిల్‌ను ఆశీర్వదించడానికి సుబ్బరామిరెడ్డి, కె.టి.ఆర్‌. సహా అందరూ మిత్రులు రావడం ఆనందంగా ఉంది. సినిమా హైదరాబాద్‌, బెంగళూరుల్లో అక్టోబర్‌ 6న విడుదలవుతుంది అన్నారు.


 మావాడు చాలా కష్టపడ్డాడు

మావాడు చాలా కష్టపడ్డాడు


నిఖిల్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డ్యాన్సులు, ఫైట్స్‌లో బాగా ట్రయినింగ్‌ తీసుకున్నాడు. ఈ సినిమా క్రెడిట్‌ అంతా దర్శకుడు మహదేవ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ సహా చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్‌కే చెందుతుంది అని దేవగౌడ్ అన్నారు. భాషతో సంబంధం లేకుండా

భాషతో సంబంధం లేకుండా


తెలంగాణ ఐటీ మినిష్టర్‌ కె.టి.ఆర్‌ మాట్లాడుతూ - ''దేవగౌడ, కుమారస్వామిగారితో చాలా మంచి అనుబంధం ఉంది. వారి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అవుతున్న నిఖిల్‌లో చాలా ఫైర్‌ ఉంది. నిఖిల్‌ తన తాతగారు, తండ్రిగారి పేరుని నిలబెడతాడు. భవిష్యత్‌లో తను మంచి హీరోగా ఎదుగుతాడు. తమన్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాను, హీరోలను ఎంకరేజ్‌ చేసే మంచి సంస్కృతి తెలుగు ప్రేక్షకులకు ఉంది. అలాంటి సంస్కృతితోనే నిఖిల్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం'' అన్నారు. సానపెడితే వజ్రం అవుతాడనిపించింది

సానపెడితే వజ్రం అవుతాడనిపించింది


ఈ సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ - ''కుమారస్వామిగారు నన్ను బెంగళూరుకి పిలిచి నిఖిల్‌ను పరిచయం చేసి తను హీరోగా ఓ కథను రాయమని అన్నారు. ముందు సాధారణంగానే కనపడ్డాడు. అయితే తను చేసిన ఓ యాడ్‌ చూడగానే తనను సానపడితే ఓ వజ్రం అవుతాడనిపించింది అన్నారు. అలాంటి తండ్రి దొరకడం అదృష్టం

అలాంటి తండ్రి దొరకడం అదృష్టం


కుమారస్వామిగారు సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కుమారస్వామి లాంటి తండ్రి ఉండటం నిఖిల్‌కుమార్‌ అదృష్టం. నిఖిల్‌కుమార్‌ చాలా సౌమ్యంగా ఉంటున్నాడు. తన మంచి ప్రవర్తనతోనే తనింకా ఎదుగుతాడు. ఇక దర్శకుడు మహదేవ్‌ నాకు బిడ్డలాంటివాడు. రాజమౌళిని ఎలా చూస్తానో, మహదేవ్‌ను కూడా అలాగే చూస్తాను. తను ఈ సినిమాతో తనెంటో ప్రూవ్‌ చేసుకుంటాడు. ఈ సినిమాతో నిఖిల్‌, మహదేవ్‌ల కెరీర్‌ లాంచ్‌ చేస్తున్నామని భావిస్తున్నానని విజయేంద్రప్రసాద్ తెలిపారు. నిఖిల్‌ డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌.

నిఖిల్‌ డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌.


జగపతిబాబు మాట్లాడుతూ - ''దేవగౌడ, కె.టి.ఆర్‌. వంటి అగ్రెసివ్‌ లీడర్స్‌ను కలిశాను. అలాగే నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేసిన సుబ్బరామిరెడ్డిగారికి థాంక్స్‌. ఈ సినిమాతో కుమారస్వామిగారు నాకు మంచి మిత్రుడుగా మారిపోయారు. చాలా మంచి వ్యక్తి. గొప్ప నాయకుడు. సినిమాకు పనిచేసిన దర్శకుడు మహదేవ్‌ నుండి మనోజ్‌ పరమ హంస, థమన్‌ సహా అందరూ ప్రాణం పెట్టి పనిచేయకుండా ప్రాణం పోయేలా పనిచేశారు. నిఖిల్‌ డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌. మంచి హార్డ్‌వర్కర్‌. టీం అందరూ బాగా కష్టపడి పనిచేశారు. సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది'' అన్నారు. నాకు ఇది గొప్ప విషయం

నాకు ఇది గొప్ప విషయం


ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ - ''జాగ్వార్‌ సినిమా తెలుగు, కన్నడంలో రూపొందుతోంది. ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. నిఖిల్‌ సహా టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు. చాలా ఫ్యాషన్ తో ఈ సినిమా చేసాం

చాలా ఫ్యాషన్ తో ఈ సినిమా చేసాం


నిఖిల్‌కుమార్‌ మాట్లాడుతూ - ''సినిమా అక్టోబర్‌ 6న విడుదలవుతుంది. చాలా ప్యాషన్‌తో సినిమా చేశాం. థమన్‌ వండర్‌ ఫుల్‌ మ్యూజిక్‌ అందించగా, మనోజ్‌ పరమహంస చాలా రిచ్‌గా సినిమాను చూపించారు. మహదేవ్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. జగపతిబాబు, సంపత్‌, బ్రహ్మానందం సహా మంచి నటీనటులు, టెక్నిషియన్స్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను'' అన్నారు. తారాగణం, టెక్నీషియన్స్

తారాగణం, టెక్నీషియన్స్


జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌.
English summary
Jaguar Movie Audio Launch event held at Hyderabad. Nikhil Kumar Gowda, Deepti Sati, Mahadev, Anitha Kumaraswamy, HD Kumaraswamy, S Thaman, Manoj Paramahamsa, Ruben, HD Deve Gowda, KT Rama Rao, T Subbarami Reddy, Brahmanandam, Jagapathi Babu, KV Vijayendra Prasad, D Suresh Babu, Raghu Babu, Suma, V. Chamundeswaranath, Tammareddy Bharadwaja, PV Sindhu, Pullela Gopichand, C Kalyan, KL Damodar Prasad, Vamsy, Ram Laxman, Chethan Kumar, Ramajogayya Sastry, Kolla Ashok Kumar and others graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu