»   » ఎన్టీఆర్‌కి వరం... నా అదృష్టం: ‘జై లవ కుశ’ డైరెక్టర్ బాబీ

ఎన్టీఆర్‌కి వరం... నా అదృష్టం: ‘జై లవ కుశ’ డైరెక్టర్ బాబీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం 'జై లవ కుశ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ పూణెలో జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు బాబీ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీస్తున్నాడని పొగడ్తలు గుప్పిస్తూ బాబీ చేసిన ట్వీట్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెంచేలా చేసింది.


నమ్మశక్యంకాని అనుభవం

నమ్మశక్యంకాని అనుభవం

ఎన్టీఆర్ మన కళ్ల ముందు డ్యాన్స్ చేస్తుంటే చూడటం నమ్మశక్యం కాని అనుభం..... అంటూ తాను ఎన్టీఆర్ డాన్స్‌కు వీరాభిమానిని అనే విషయం చెప్పకనే చెప్పారు బాబీ.


అతడికి వరం

అతడికి వరం

పుట్టుకతోనే కొందరికి కొన్ని లక్షణాలు అబ్బుతాయి. అది వారసత్వమో? లేక మరేమైనా అనుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు నటన, డాన్స్‌కు రెండూ వారసత్వంగా అబ్బాయి. ఈ విషయాన్ని బాబీ ప్రస్తావిస్తూ.... ఆ ప్రతిభ అతడికి ఒక వరం, తారక్ డాన్స్ చేస్తుండగా నేరుగా చూడటం నా అదృష్టం అంటూ బాబీ ట్వీట్ చేశాడు.


నట విశ్వరూపమే

నట విశ్వరూపమే

ఇప్పటికే విడుదలైన ‘జై' టీజర్ ద్వారా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటవిశ్వరూపం చూపించబోతున్నారనే విషయం అభిమానులకు అర్థమైంది. బాబీ ట్వీట్ ద్వారా సినిమాలో కనువిందు చేసే డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు ఫ్యాన్స్.


త్రిపాత్రాభినయం

త్రిపాత్రాభినయం

‘జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ‘జై' అనే పాత్ర రావణుడిలా విలనిజాన్ని పోలి ఉంటుందని ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది. లవ, కుశ పాత్రలను పరిచయం చేస్తూ త్వరలో మరిన్ని టీజర్లు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.English summary
'Jai Lava Kusa' director Bobby tweeted that "It's an unbelievable experience to watch NTR garu dancing in front of ur eyes.. He's gifted and I'm blessed tarak9999 NTRArtsOfficial". 'Jai Lava Kusa' team is presently canning a song in Pune.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu