»   » ‘జై లవ కుశ’: లీకైన టైటిల్ సాంగ్ ఇదే (వీడియో)

‘జై లవ కుశ’: లీకైన టైటిల్ సాంగ్ ఇదే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' సినిమా రిలీజ్ ముందే లీక్ అవుతూ నిర్మాతలను కంగారు పెడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తుండగా కొన్ని రోజుల క్రితం 'జై' పాత్రను పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ రిలీజ్ ముందే ఆన్ లైన్లో లీక్ అయింది.

ఈ లీక్ విషయమై నిర్మాత కళ్యాణ్ రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి బాధ్యుడైన గణేష్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటన తర్వాత వెంటనే 'జై' టీజర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. తాజాగా 'జై లవ కుశ' చిత్రానికి సంబంధించి మరో లీక్ జరిగిపోయింది.


టైటిల్ సాంగ్ లీక్

తాజాగా సినిమాలోని 'రావణ..' అనే సాంగ్ లీక్ అయింది. జై పాత్ర కోసం ఈ పాటను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వీడియో యూట్యూబ్‌లో పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


జై టీజర్‌కు ఊహించని స్పందన

జై టీజర్‌కు ఊహించని స్పందన

ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తుండగా ‘జై' అనే పాత్ర రావణుడిలా విలనిజంతో కూడిన పాత్ర. ఈ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘జై' టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.


సౌతిండియా రికార్డ్

సౌతిండియా రికార్డ్

‘జై' టీజర్ 24 గంట్లోలనే 7.8 మిలియన్ వ్యూస్ సాధించి...... సౌతిండియాలో ఫాస్టెస్ట్‌ వ్యూస్ సాధించి టీజర్‌గా రికార్డులకెక్కింది.ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

‘జై లవ కుశ' చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాపులో లవ, కుశ పాత్రలను పరిచయం చేస్తూ టీజర్లు, సినిమా ట్రైలర్ వరుస పెట్టి విడుదల చేయబోతున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ నాయికలు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.English summary
NTR Jai LavaKusa Title Song Leaked. Whether the song is a background song played whenever ‘Jai,’ the evil character in the film played by NTR, appears on screen or is a song sung by NTR is however not clear.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu