For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘జై లవ కుశ’... తమన్నా స్పెషల్ సాంగ్ ప్రోమో ఇదే

  By Bojja Kumar
  |
  Tamanna Special Song In "Jai Lava Kusa" తమన్నా స్పెషల్ సాంగ్ ప్రోమో ఇదే..

  'జై లవ కుశ' ప్రమోషన్లు జోరందుకున్నాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమాలోని స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. 'స్వింగ్ జరా' అంటూ సాగే ఈ స్పెషల్ నంబర్లో హీరోయిన్ తమన్నా నటించింది. దేవిశ్రీ అందించిన సంగీతానికి తమన్నా హాట్ హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగులో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు.

  ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జై పాత్రపై ఈ స్వింగ్ జర సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ చిత్రం ది బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు.

  స్వింగ్ జరా ప్రోమో

  స్వింగ్ జరా పాట మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుందని భావిస్తున్నారు. తమన్నా గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.

  అనసూహ్య స్పందన

  ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా భారీ స్థాయి లో "జై లవ కుశ" చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. కేవలం 38 గంటల లో కోటి కి పైగా వ్యూస్ ను "జై లవ కుశ" ట్రైలర్ సంపాదించుకుంది.

  నమ్మకంగా ఉన్న కళ్యాణ్ రామ్

  నమ్మకంగా ఉన్న కళ్యాణ్ రామ్

  "యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో పాటు, అన్నదమ్ముల మధ్య నడిచే ఒక బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నాం" అని నిర్మాత కళ్యాణ్ రామ్ అన్నారు.

  జై లవ కుశ

  జై లవ కుశ

  కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్)

  ట్రైలర్

  ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జై లవ కుశ' ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు 'జై లవ కుశ' అయినా... సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి. ఏ తల్లికైనా ముగ్గురు మగ పిల్లలు పుడితే రామ లక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్ట వశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ... రామ లక్ష్మణులయ్యారు అంటూ 'జై లవ కుశ' ట్రైలర్ మొదలైంది.

  రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

  రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

  'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు.

  పూర్తి స్పీచ్ కోసం క్లిక్ చేయండి

  ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

  ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

  'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి, సినిమా కోసం తన తమ్ముడు తారక్ పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  "Swing Zara Video Song Promo" released from Jai lava Kusa movie. Jr.NTR's Jai Lava Kusa is grabbing the headlines since quite a point of time for various reasons. Jai Lava Kusa teasers, trailer, and posters have generated much positive buzz among the audience The makers of the movie have released a special number from Jai Lava Kusa. It is going viral on social networks.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X