twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జై లవకుశ ట్వీట్ రివ్యూ: జై పాత్ర అదుర్స్.. ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్

    భారీ అంచనాల మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 21న) విడుదలైంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం గురించి అప్పుడే ప్రేక్షకులు తమ అభిప్రాయాలను మీడియాలో పంచుకొంటున్నారు. ఆసక్తితో

    By Rajababu
    |

    Recommended Video

    Jai Lava Kusa Twitter Review : Mixed response from audience జై లవకుశ ట్వీట్ రివ్యూ

    భారీ అంచనాల మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్ 21న) విడుదలైంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం గురించి అప్పుడే ప్రేక్షకులు తమ అభిప్రాయాలను మీడియాలో పంచుకొంటున్నారు. ఆసక్తితో ఉన్న సినీ అభిమానుల కోసం ప్రేక్షకుల రివ్యూను మీ కోసం అందిస్తున్నాం. సోషల్ మీడియాలో ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తెలియజేయడంతోపాటు.. జై లవకుశ గురించి సవివరమైన ఫిల్మ్‌బీట్ రివ్యూ కొద్దిసేపట్లో మీకోసం..

    కామెడీ టైమింగ్

    కామెడీ టైమింగ్

    ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. కుశ క్యారెక్టర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. లవ, రాశీ లవ్ ట్రాక్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాగ్ మైండ్ బ్లోయింగ్ అని ఓ ప్రేక్షకుడు తొలిభాగం గురించి చెప్పాడు.

    దుబాయ్‌లో సూపర్ హిట్ టాక్

    దుబాయ్‌లో సూపర్ హిట్ టాక్

    దుబాయ్‌లో శుక్రవారం ఉదయమే ప్రీమియర్ ముగిసింది. హిట్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తున్నది. ఎన్టీఆర్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్. సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడానికి తారక్ తన స్థాయికి మంచి ప్రయత్నించారు.

    జై క్యారక్టర్ రావణగా ఎలా

    స్క్రీన్ ప్లే బ్రిల్లియంట్. జై క్యారక్టర్ రావణగా ఎలా మారాడో అనే విషయాన్ని చక్కగా చూపించాడు. ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడం బాగుంది. రీరికార్డింగ్‌తో దేవీ శ్రీ ప్రసాద్ సినిమాను ఆడుకొన్నాడు. డీఎస్పీ అదుర్స్.

    బీ గ్రేడ్ మూవీ..

    ఓ పక్క సినిమా గురించి పాజిటివ్‌గా టాక్ వస్తుంటే.. మరో వైపు సినిమా నచ్చలేదని అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నది. బీ గ్రేడ్ మూవీ. సెన్స్ లెస్ సీన్లు. నా సహనాన్ని పరీక్షిస్తున్నది. 80 నాటి లవ్ సీన్లు. బాబీ సినిమాను చెడగొట్టాడు.

    కుశ క్యారెక్టర్‌తో

    కుశ క్యారెక్టర్‌తో

    ఫస్టాఫ్‌ బాగుంది. తొలి భాగంలో కుశ క్యారెక్టర్‌తో మూవీ నడిచిపోయింది. సినిమా బాగుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన రిపోర్ట్ ఇది.

    సెకండాఫ్‌లో తొలి పది నిమిషాలు స్లోగా

    సెకండాఫ్‌లో తొలి పది నిమిషాలు స్లోగా

    సెకండాఫ్‌లో తొలి పది నిమిషాలు స్లోగా ఉంది. ఆ తర్వాత ఇరుగదీసింది. నీ కళ్లలోనా పాట బాగుంది. సినిమా మంచి ఫీల్‌తో వెళ్తున్నది.

    ఫస్టాఫ్ యావరేజ్

    ఫస్టాఫ్ యావరేజ్.. చెడుగా ఉందని చెప్పుకోవడానికి ఈ చిత్రం గురించి ఏమీ లేదు.

    ఎక్సైటింగ్ ఏమీ లేదు

    ట్రైలర్, టీజర్ చూస్తే సరిపోతుంది. ఎక్సైటింగ్ ఏమీ లేదు. యావరేజ్ సినిమా.

    జై పాత్ర ఇంట్రడక్షన్

    ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. జై పాత్ర ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ఫైట్ సూపర్బ్. ఆ పది నిమిషాలు పక్కన పెడితే ఫస్టాఫ్‌లో ఏమీ లేదు.

    జైలవకుశ గురించి ఒక్కమాటలో

    జైలవకుశ చిత్రం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫస్టాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్.. సెకండాఫ్ ఎమోషనల్‌గా ఉంది.

    English summary
    Young Tiger Junior NTR's Jai Lava Kusa is releasing between huge expectations. Lead heroines are Raashi Khanna and Niveda Thomas. This movie which produced by NTR Arts banner, is going to release in 2400 screens worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X