»   » కలర్స్ స్వాతి, సన్నీ లియోన్ సినిమా తెలుగులో...

కలర్స్ స్వాతి, సన్నీ లియోన్ సినిమా తెలుగులో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి, ఇండో కెనడియన్ శృంగార చిత్రాల తార సన్నీ లియోన్ ఒకే సినిమాలో నటించిన సినిమా తెలుగులో రాబోతోంది. తమిళంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు. జై, కలర్స్ స్వాతి జంటగా తమిళంలో రూపొందించిన 'వడకరి' చిత్రాన్ని తెలుగులో 'కుల్ఫీ' పేరుతో సామల నరసింహారెడ్డి అనువాదం చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఈనెల 9న విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సామల నరసింహారెడ్డి మాట్లాడుతూ- అనువాద కార్యక్రమాలు పూర్తిచేసి ప్రస్తుతం డిటిఎస్ పనులు జరుపుతున్నామని, నేటి యువతరాన్ని ఆకట్టుకునే రీతిలో ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించారని, ముఖ్యంగా సెక్స్‌బాంబ్ సన్నీలియోన్‌తో చిత్రీకరించిన పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు.

Jai-Swathi-Sunny Leone's 'Kulfi' audio on June 9th

బ్యాంకాక్, దుబాయ్‌లలో సెట్స్ వేసి సన్నీ లియోన్, కథానాయకుడు జైలపై పాటలను చిత్రీకరించామని, అవి సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయని, ఈనెల 9న పాటలను విడుదల చేసి సినిమాను కూడా ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అన్ని తరగతుల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఆరు పాటలను యువన్ శంకర్‌రాజా అందంగా అందించారని, ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఎ.ఎన్.బాలాజి తెలిపారు.

కస్తూరి, తమిళ దర్శకుడు వెంకట ప్రభు కీలకమైన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నిషాగోషల్, అరుల్‌దాస్, బాలాజి తదితరులు నటించారు. మాటలు:కృష్ణతేజ, పాటలు:్భవనచంద్ర, కందికొండ, వనమాలి, శ్రీమణి, పవన్, కెమెరా: ఎస్.వెంకటేష్, సంగీతం: యువన్ శంకర్‌రాజా, నిర్వహణ: ఎ.ఎన్.బాలాజీ, నిర్మాత: నరసింహారెడ్డి సామల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శరవణ రాజన్.

English summary
Jai and Colors Swathi are acting as the lead pair in a Tamil film titled 'Vadacurry'. This film is being dubbed into Telugu as 'Kulfi'. Sunny Leone will appear in a special song in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu