సౌతిండియా మొత్తం ‘జై’ కొట్టే రికార్డ్.... ఆనందంతో ఎన్టీఆర్ ట్వీట్!
జై టీజర్ 24 గంటల్లో 7.8 వ్యూస్ సాధించింది. ఒక రోజులో అత్యధిక వ్యూస్ సాధించిన సౌతిండియా రికార్డ్ ఇదే.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' చిత్రంలో 'జై' పాత్రను పరిచయం చేస్తూ గురువారం సాయంత్రం 5.22 గంటలకు విడుదల చేసిన టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసింది. 24 గంట్లోలనే 7.8 మిలియన్ వ్యూస్ సాధించి...... సౌతిండియాలో ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించి టీజర్‌గా రికార్డులకెక్కింది.
టీజర్‌కు ఇంత భారీ రెస్పాన్స్ రావడంపై ఎన్టీఆర్ స్పందించారు. టీజర్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణమైన అభిమానులు, స్నేహితులు, మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మీ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
అఫీషియల్ గా వెల్లడించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
సౌతిండియాలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ డిజిటల్ వ్యూస్ సాధించి టీజర్ గా రికార్డు సాధించింది. ఈ రికార్డు అందుకోవడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది.
లవ్ యూ ఆల్ అంటూ ఎన్టీఆర్
టీజర్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణమైన అభిమానులు, స్నేహితులు, మీడియాకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మీ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ లవ్ యూ ఆల్ అంటూ ట్వీట్ చేశారు.
22 గంట్లల్లో 7 మిలియన్
ఈ టీజర్ 22 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ సాధించింది.
లైక్స్ రికార్డ్
ఫాస్టెస్ట్‌గా 100k లైక్స్ సాధించిన టీజర్ కూడా ఇదే. 100 నిమిషాల్లోనే ఈ ఘనత సాధించింది. 24 గంటలు గడిచేలోపు 192k లైక్స్ వచ్చాయి.


Click it and Unblock the Notifications











