»   »  కరో కరో 'జల్సా'

కరో కరో 'జల్సా'

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆంధ్రానే కాక అన్ని ప్రాంతాలు రేపు 'జల్సా' చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి.ఎక్కడ చూసినా అదే హోరు, అదే జోరు. ఈ చిత్రం పై వచ్చిన క్రేజు ఈ మధ్యన దేనికి రాలేదంటే అతిశయోక్తి కాదు.350 ప్రింట్ల నుండి 400 ప్రింట్ల వరకూ స్ట్రయికింగ్ కి వెళుతున్న ఈ చిత్రం 800 నుండి 900 వరకూ ధియోటర్లలో రిలిజయ్యే అవకాశాలు ఉన్నాయి. రొమాంటిక్ కామెడీలు రూపొందిచటంలో సిద్దహస్తుడు, పంచ్ లతో ఆడుకునే దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ యూత్ లో అనూహ్యమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తో జల్సా రూపొందించటం మరో ఖుషీ రేంజి ఫిల్మ్ అవుతుందనే ఆసక్తి కలిగిస్తోంది. దాంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. మొదటి రోజు మొదటి ఆట చూడాలని ఎండలను సైతం లెక్క చేయకుండా టిక్కెట్లు కోసం థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు.

మరో ప్రక్క చాలా జిల్లాల్లో రాజకీయ నాయకులు చిరు, పవన్ అభిమానులని ఆకట్టుకునేందుకు టిక్కెట్లు, థియేటర్లు బల్క్ గా బుక్ చేసి సంచలనం సృష్టస్తున్నారు. దాంతో బ్లాకులో కొనుక్కొనే భారం తప్పిందని చాలా మంది సంబర పడుతున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ 10 కోట్ల రూపాయలకు పైగా ఉంటాయిని ఒక అంచనా. ఇంకా తెలుగు సినిమా రికార్డులు తిరగ రాసిన పోకిరి రికార్డులు అధిగమిస్తుందని అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఈ సినిమాలో హీరో మహేష్ బాబు వాయిస్ వినిపించం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం యువతను ఊపేస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంలో అందాల ఇలియానా మెయిన్ హీరోయిన్ కాగా పార్వతీ మిల్టన్,కమిలిని ముఖర్జీ లు మిగతా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో పవన్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారని సామాజిక సందేశానికి వినోదాన్ని కలిపి పంచతున్నారని వినిపిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X