»   » వావ్ ‌:'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' మరో పాట (వీడియో)

వావ్ ‌:'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' మరో పాట (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

‌ముంబై: బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటిస్తున్న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రంలోని 'జల్తే దియా' అనే పాట వీడియో విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు.

సూరజ్‌ బర్‌జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిమేశ్‌ రేషమియా సంగీతం సమకూరుస్తున్నారు. నవంబర్‌ 12న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ హై కౌన్ చిత్రాలను భారతీయులు ఎప్పటికి మరిచిపోలేరు. ఆ చిత్రాల్లో ప్రేమ్ గా సల్మాన్ అందరి మనస్సులో గుర్తుండిపోయేలా లవ్ లీగా చేసేసి భారతావనని తన ప్రేమ కథలతో ఊపేసాడు. అయితే ఆ చిత్ర దర్శకుడుతో ఆయన మళ్లీ చిత్రం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.

'Jalte Diye' VIDEO Song from Prem Ratan Dhan Payo

బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వంలో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

గతంలో సల్మాన్‌ఖాన్‌తో దర్శకుడు సూరజ్‌ బర్‌జాత్యా మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై,హమ్ ఆప్ కే కౌన్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తీశాడు. ఈ కాంబినేషన్ తాజాగా నాలుగోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

English summary
Presenting "Jalte Diye" VIDEO Song from bollywood movie Prem Ratan Dhan Payo starring Salman Khan and Sonam Kapoor in lead roles exclusively on T-Series.
Please Wait while comments are loading...