»   » లాస్ట్ మినిట్ లో అల్లరి నరేష్ డ్రాప్

లాస్ట్ మినిట్ లో అల్లరి నరేష్ డ్రాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్: అల్లరి నరేష్ చిత్రాలంటే ప్రత్యేకమైన క్రేజ్ భాక్సాఫీస్ వద్ద ఉంది. అతని సినిమాలకు మంచి ఓపినింగ్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అతని సినిమాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి. రీసెంట్ గా అతను తాజా చిత్రం ‘జేమ్స్ బాండ్' జూన్ 26 రిలీజ్ కు రెడీ అయ్యింది. అయితే చివరి నిముషంలో డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. రుద్రమదేవి చిత్రం రిలీజ్ కు అదే రోజు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రమోషన్స్ సైతం ఆపుచేసేసారు. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘జేమ్స్ బాండ్'. . ‘నేను కాదు నా పెళ్లాం' ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘'మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. మంచి ఎంటర్ టైనర్. ప్రస్తుతం సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనేదే కాన్సెప్ట్. సాయికిషోర్ గారు చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఆరు పాటలుంటాయి. అన్నీ డిఫరెంట్ సాంగ్స్. పాటలు బాగా వచ్చాయి. ప్రస్తుతం బ్యాగ్రౌండ్ స్కోర్ జరుగుతుంది.సాయి కార్తీక్ అద్భుతైమన సంగీతాన్నందించారు. '' అన్నారు.

హీరోయిన్ విషయానికి వస్తే... మంచు మనోజ్ ‘పోటుగాడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాక్షి చౌదరి. కొంత కాలం గ్యాప్ తర్వాత ఈ అందాల భామ తెలుగులో ఈ అవకాశం సొంతం చేసుకుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి హుషారైన అమ్మాయి పాత్రను పోషిస్తుంది. అల్లరి నరేష్ ఎత్తుకు సరిపడా అందమైన అమ్మాయి కోసం వెతకగా, సాక్షి అయితే బాగుంటుందని ఫిల్మ్ మేకర్స్ భావించారు.

James Bond: Allari Naresh dropped out

కాపీనా?

ఒకప్పుడు హాలీవుడ్ నుంచి మాత్రమే సినిమాలు ఎత్తేవారు. ఇప్పుడు కాలం మారింది. గ్లోబులైజేషేన్ నేపధ్యంలో ప్రపంచం కుగ్రామంలాగ మారింది. దాంతో ఎక్కడెక్కడ వనరులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా సినిమావారికి ప్రపంచం సినిమా బాగా దగ్గరైపోయింది. దాంతో ఎత్తిపోతల పథకాలు ఎక్కువయ్యాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే అల్లరి నరేష్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుప్పు మంది.

ఈ చిత్రం కొరియా చిత్రం "My Wife Is A Gangster" ఆధారంగా రూపొందుతోందని టాక్. ఈ సినిమాలో ...ఓ డాన్ కు ఓ అమాయికుడు కి మధ్య జరిగే కామెడీ తో రన్ అవుతుంది. 'జేమ్స్‌ బాండ్‌' కూడా అలాంటి కథే అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాలి. అలాగే..గతంలోనూ అల్లరి నరేష్..ఇదే బ్యానర్ లో చేసిన అహనా పెళ్లంట చిత్రం సైతం ఇదే సినిమా నుంచి తీసుకున్నది కావటం విశేషం.

ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూయూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ.

English summary
Finally it is revealed that Allari Naresh's James Bond is not hitting screens on June 26th as publicised all these dates. Fresh date of the flick is not known, but this 26th is out of consideration.
Please Wait while comments are loading...