»   » చిరు, పవన్ లకి ఒకేసారి పంచ్...., జయసుధ ఇలా అనేసింది మరి.

చిరు, పవన్ లకి ఒకేసారి పంచ్...., జయసుధ ఇలా అనేసింది మరి.

Posted By:
Subscribe to Filmibeat Telugu

జయసుధ ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నుంచీ ఇప్పటి వరకూ ఒకే రకమైన క్రేజ్ తో కొనసాగుతున్ననటి. జయసుధ సినిమాల్లో హీరోయింగా ఉనా, హీరోకి అమ్మగా ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా ఎలా ఉనా ఆమె ఒక ప్రత్యేకమే. ఇప్పటికీ తీరిక లేకుండా సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. కాంగ్రేస్ లో సుధీర్ఘకాలం ఉన్న జయసుధ ప్రస్తుతం టీడీపీలోకి మారిపోయిన జయసుధ రాజకీయాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

 Jayasudha

అయితే ఈసారి మాత్రం పవన్ గాలి తీసిపడేసింది. ఉద్దెశపూర్వకంగా అన్నారో నిజమో కానీ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే తప్ప పార్టీ పేరు చెప్తే తెలియదంటూ చెప్పింది జయ సుధ. పనిలో పని చిరంజీవి పార్టీ ప్రజా రాజ్యం మీద కూదా ఓ పంచ్ విసిరేసింది. ఇంతకీ జయ సుధ అన్న మాటేమిటంటారా..??

'మీరు భవిష్యత్తులో 'జనసేన'లో జాయిన్‌ అవుతారా?' అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ పార్టీ ఎవరిదని ప్రశ్నించింది జయ సుధ. 'పవన్‌ పార్టీ పేరు 'జనసేన' అని నాకు తెలియదు. పవన్‌ కల్యాణ్ పార్టీ అంటేనే నాకు తెలుస్తుంది. పవన్‌ ఆలోచనలు బాగున్నాయి. నేను అందర్నీ సపోర్ట్‌ చేస్తాను. కష్టపడిన వారు గెలుస్తార'ని తెలిపింది. ఇక, పవన్‌ పార్టీలో జాయినవడం గురించి సమాధానమిస్తూ.. 'వద్దులెండి. 2009 ఎన్నికలకు ముందు మీరు చిరంజీవి పార్టీలో చేరుతారా? అని నన్ను అడిగేవారు. అయితే కొన్ని నెలల తర్వాత ఆయనే మా పార్టీ (కాంగ్రెస్‌)లో చేరిపోయారని చెప్పింది.

English summary
In a Interview When an interviewer asked if she would like to join Jana Sena Party, Jayasudha couldn’t recognize the party’s name.She explains that she always knew Pawan Kalyan‘s party, not by the party name, but by his name as Pawan’s party. For her, it’s Pawan Kalyan’s party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu