»   » పవన్ ‘జన సేన’ పార్టీ మెంబర్ షిప్ తీసుకోవడం ఎలా?

పవన్ ‘జన సేన’ పార్టీ మెంబర్ షిప్ తీసుకోవడం ఎలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల 14న హడావుడిగా నోవాటెల్ హోటల్‌లో సభ ఏర్పాటు చేసారు. కేవలం కొంత మంది అభిమానులకు మాత్రమే ఆ సభలో పాల్గొనే అవకాశం దక్కింది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగం, ఆయన పార్టీ పెట్టడానికి కారణం ఏమిటి? అనే విషయాలు విన్న తర్వాత చాలా మంది అభిమానులు, సాధారణ ప్రజలు కూడా ఆయన మాటలకు ఆకర్షితులు అయ్యారు.

ఇప్పటికే చాలా మంది జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ పార్టీలో ఎలా చేరాలి? మెంబర్ షిప్ ఎలా తీసుకోవాలో తెలియని పరిస్థితి. పార్టీ ఆవిర్భవించి కేవలం వారం రోజులు మాత్రమే కావడమే ఇలాంటి పరిస్థితికికారణం. ఊరూరా పార్టీ విస్తరించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో....జనసేన పార్టీ వారు ఆన్ లైన్ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు.

Jana Sena Party membership

ఆన్ లైన్ మెంబర్ షిప్ తీసుకునే వారు www.janasenaparty.org వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇందులో ఫోటో, వివరాలు సమర్పిస్తే మీకు నెంబర్ తో కూడిన ఐడెంటిటీ కార్డు ప్రింటు తీసుకోవడానికి వీలుగా వస్తుంది. ఆన్ లైన్ ద్వారా సమర్పించిన వివరాలు పార్టీ ఆఫీసులో స్టోర్ చేయబడతాయి.

కేవలం ఆన్ లైన్ మెంబర్ షిప్ మాత్రమే కాదు.....రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు పార్టీ వర్గాల నుండి తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన పవన్ కళ్యాణ్ తన రెండో మీటింగును విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసారు. ఇటీవల నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన మీటింగులో ఆహ్వానితులకు మాత్రమే పాల్గొనే అవకాశం దక్కింది. అయితే ఈ మీటింగుకు అభిమానులందరూ హాజరు కాబోతున్నారు. దాదాపు లక్ష మంది ఈ మీటింగులో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

English summary
Jana Sena Party spokesperson M Raghava Rao told newsmen that party membership enrollment programme has been launched and interested persons can register their names on the website www.janasenaparty.org.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu