twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    10 గంటల్లోనే: ‘జనసేన’ పార్టీ పాట వెనక ఎవరు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నారనే వార్తలు మొదలైనప్పటి నుండి....పార్టీకి సంబంధించిన విషయాలపై అభిమానులు, ప్రజలు, మీడియా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆసక్తికి అనుగుణంగా ఒక్కో విషయం బయటకు
    వస్తోంది. పార్టీ గుర్తు, జెండా, లక్ష్యాలు ఇప్పటికే విడుదలయ్యాయి.

    ఇటీవల విడుదలైన 'జన సేన పార్టీ' పాట కూడా బాగా పాపులర్ అయింది. జనాల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా, పవన్ కళ్యాణ్ వైపు ప్రజలు తరలి వచ్చే విధంగా ఈ పాట ఉండటం గమనార్హం. ఈ పాట రాసినవారి వివరాలు, కంపోజ్ చేసిన వారి వివరాలు కూడా
    తాజాగా బయటకు వచ్చాయి.

    ఈ పాటను ఇంద్రగంటి లక్ష్మి శ్రీనివాస్ కంపోజ్ చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా పిలిపించి పాట కంపోజ్ చేయాలని కోరినట్లు, సమయం ఎక్కువగా లేక పోవడంతో రాత్రికి రాత్రే పూర్తి చేయాలని కోరినట్లు ఇంద్రగంటి లక్ష్మీశ్రీనివాస్ తెలిపారు. తాను కంపోజ్ చేసిన
    పాట ప్రజాదరణ పొందడం చాలా ఆనందంగా ఉందని ఇంద్రగంటి శ్రీనివాస్ తెలిపారు.

    Jana Sena Party

    ఇక ఈ పాటను రెహమాన్ రచించారు. పవన్‌తో ఉన్న పరిచయం గురించి రెహమాన్ వివరిస్తూ....తీన్‌మార్ సినిమా సమయంలో ఆయనతో పరిచయం ఏర్పడిందని, ఆ సినిమా కోసం నేను రాసిన 'గెలుపు తలుపు తీసే' సాంగు ఆయనకు బాగా నచ్చిందని, అందు వల్ల పవన్ కళ్యాణ్ పార్టీకి పాట రాసే అవకాశం దక్కిదని రెహమాన్ తెలిపారు.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం హైటెక్స్‌లో నిర్వహించే సభలో 'జన సేన' పార్టీని ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. పవన్ మాట్లాడే సభా వేదికను ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి డిజైన్ చేసారు. ఈ సభలో దాదాపు 4 వేల మంది అభిమానులు పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని అభిమానులకు పాసులు కూడా అందజేసారు. పాసులు ఉన్న వారికి మాత్రమే సభలోనికి అనుమతి ఉంటుంది. ఇక్కడి వరకు రాని అభిమానుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు భారీ తెరలు ఏర్పాటు చేసారు. ఈ తెరలపై పవన్ కళ్యాణ్ స్పీచ్ లైవ్ ప్రసారం కానుంది.

    <center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/myawP8bzqbI?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

    English summary
    Jana Sena party song is composed by Indranganti Lakshmi Srinivas, lyricist Rahman has penned inspiring lyrics for which the song got popularized all over the state in no time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X