»   » రాజమౌళి 'ఈగ'కు ఆ దర్శక, రచయిత?

రాజమౌళి 'ఈగ'కు ఆ దర్శక, రచయిత?

Posted By:
Subscribe to Filmibeat Telugu
SS Rajamouli
నాని, సమంత కాంబినేషన్ లో రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'ఈగ'. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంకి మాటలు రాయటానికి కానూ దర్శక, రచయిత జనార్ధన మహర్షిని తీసుకున్నట్లు తెలుస్తోంది. చేతిలో ఒక్క సినిమా కూడా లేని జనార్ధన మహర్షిని ఈ సినిమాకు తీసుకోవటానికి కారణం కథలో ఫన్ ఎలిమెంట్సే అంటున్నారు. తమిళ వెర్షన్ కి గానూ క్రేజీ మోహన్ ని తీసుకున్నారు. క్రేజీ మోహన్...కమల్ హాసన్ చేసే కామిడీ చిత్రాలన్నిటికీ పనిచేసిన గొప్ప రచయిత. ఇక ఈగ చిత్రంలో విలన్ గా కన్నడ నటుడు సుదీప్ చేస్తున్నారు. అలాగే సుదీప్ హీరోగా కన్నడ వెర్షన్ ని రూపొందించి రిలీజ్ చేస్తున్నారు. జనార్దన మరర్షి దర్శకుడుగా దేవస్ధానం అనే చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
English summary
Janardhan Maharshi is first working with SS Rajamouli for Eega- writing dialogues for the film..The movie produced by Sai Korrapati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu