»   » అఫీషియల్ : ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ టీజర్ రిలీజ్ డేట్

అఫీషియల్ : ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ టీజర్ రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొత్తానికి ఎన్టీఆర్ అబిమానుల ఓపికకు ధన్యవాదాలు చెప్తూ దర్శకుడు కొరటాల శివ...ఎన్టీఆర్ తో తను చేస్తున్న 'జనతా గ్యారేజ్' టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశపరిచినా, ఇప్పుడు అద్బుతమైన విజువల్స్ తో ఈ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ..ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసిన రిలీజ్ డేట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


ఇంతకాలం టీజర్ కోసం ఓపిగ్గా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన కొరటాల జులై 6న 'జనతా గ్యారేజ్' ఫస్ట్ టీజర్ విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


మరో ప్రక్క 'జనతా గ్యారేజ్' ఆడియో విడదలకి మాత్రం కొత్త వేదిక సిద్ధమవుతోందని సమాచారం. ఖమ్మంలో ఈ సినిమా పాటలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొదట ఈ ఆడియో ఆవిష్కరణ అమెరికాలో చేయాలనుకున్నా ప్రస్తుతం లొకేషన్‌ ఖమ్మంకు షిఫ్ట్ చేశారంటున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.


ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. సమంత, నిత్యమీనన్ హీరోయిన్స్. పాటలు కూడా అదే నెలలో విడుదల కానున్నాయి. సినిమా ఆగష్టు 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇక ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...జ‌న‌తా గ్యారేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్... అన్ని ఏరియాలు క‌లిపి రూ.60 కోట్ల వ‌ర‌కూ బిజినెస్ జ‌రిగింది. మొదట దిల్‌రాజు రంగంలోకి దిగి ... నైజాం ఏరియాని రూ.15 కోట్ల‌కు తీసుకోవటంతో మిగతా ఏరియాల‌న్నీ హాట్ కేకులై పోయాయి.


Janatha Garage’s first teaser to be out soon

అలాగే అదే ఊపులో .. ఓవ‌ర్సీస్ రూ.7.3 కోట్ల వ‌ర‌కూ ప‌లికిన‌ట్టు టాక్‌. ఇక క‌ర్నాట‌కలో ఎన్టీఆర్ కెరీర్ లో నే చాలా ఎక్కువ రేటు పలికింది. రూ.7 కోట్లు వరకూ వ‌చ్చాయి. త‌మిళ నాట కూడా మంచి ధ‌రే ప‌లికిందీ సినిమా. మొత్తానికి.. అన్ని ఏరియాల ద్వారా రూ.60 కోట్లు వ‌చ్చేశాయి.


ఇవన్నీ పోగా... ఇక మిగిలింది శాటిలైట్ బిజినెస్. శాటిలైట్ ద్వారా మినిమం రూ.9 నుంచి పది కోట్లు వరకూ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.45 కోట్లు అని, దాంతో ఈ సినిమా దాదాపు రూ.20 కోట్ల లాభం చూసిందని చెప్తున్నారు. మామాలు విషయం కాదు కదా.

English summary
Director Koratala Siva took to Twitter a while ago and said, “Janatha garage first trailer will be out on 6th of July. Thanks to all the fans for their patience.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu