For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేటింగ్ 4 : (జనతా గ్యారేజ్ యూకె రివ్యూ రిపోర్ట్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' సినిమా ఎప్పుడు రిలీజవుతుంది... సినిమా ఎలా ఉండబోతోందని అభిమానులు కొన్ని రోజులుగా ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో వారి నిరీక్షణకు తెర పడబోతోంది.

  సినిమాకు భారీ డిమాండ్ ఉండటంతో అందుకకు తగిన విధంగానే రిలీజ్ కు ఏర్పాటు చేసారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, యూఎస్ఏ, తెలుగువారు ఎక్కువగా ఉండే ఇతరర దేశాలన్నింటిలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సినిమా రిలీజ్ కు ముందు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేస్తున్నారు.

  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యూకె రిపోర్ట్ వచ్చేసింది. యూకె, యూఏఇలో ఇండియన్ సినిమా మేగజైన్ ఎడిటర్‌, ఫిల్మ్ క్రిటిక్‌గా, యూఏఇ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఉన్న ఉమైర్ సంధు సోమవారం ప్రదర్శించిన స్పెషల్ ప్రివ్యూ షో చూసి రివ్యూ రిపోర్ట్ ఇచ్చారు. అతడు ఈ సినిమాకు ఏకంగా 4/5 రేటింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

  ఎన్టీఆర్ అభిమానులు ట్రైలర్ చూసినప్పటి నుండే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయ్యారు. సినిమా గురించి వచ్చిన ఫస్ట్ రిపోర్ట్ చాలా పాజిటివ్ గా ఉండటంతో మరింత సంతోషంగా ఉన్నారు. ఉమైర్ సంధు చెప్పిన విషయాలు బట్టి చూస్తే సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి సినిమా గురించి ఆయన రాసిన రివ్యూ రిపోర్టులో ఏముంది? పాటిజివ్ అంశాలు ఏమున్నాయి అనేది స్లైడ్ షోలో చూడండి...

  మైండ్ బ్లోయింగ్

  మైండ్ బ్లోయింగ్

  యూనిక్ కాన్సెప్ట్, ఫస్ట్ రేట్ పెర్ఫార్మెన్స్ తో సినిమా ఓవరాల్ గా మైండ్ బ్లోయింగ్ అని ఉమైర్ సంధు తెలిపారు.

  ఎన్టీఆర్

  ఎన్టీఆర్

  ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూసి సినిమా చూసే ప్రేక్షకులంతా స్టన్నవ్వడం ఖాయం అంటున్నారు. తన నటనలో కొత్తకోణాన్ని ఆవిష్కరించాడు. ముఖ్యం అతని లుక్, మాసీ యాక్షన్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం ఖాయం.

  కెరీర్లోనే బెస్ట్

  కెరీర్లోనే బెస్ట్

  సినిమా సినిమాకు ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్ లో మరింత బెటర్మెంట్ చూపిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే రేంజిలో ఉందట. అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటూ ఉమర్ సంధు ప్రశంసించారు.

  మోహన్ లాల్

  మోహన్ లాల్

  మోహన్ లాల్ టాప్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హి ఈజ్ బ్యాక్ విత్ సూపర్ బ్యాంగ్ అని తన రివ్యూ రిపోర్టులో తెలిపారు.

  సమంత, నిత్యా మీనన్

  సమంత, నిత్యా మీనన్

  సమంత, నిత్యా మీనన్ అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకున్నారు అని ఉమైర్ సంధు తెలిపారు.

  ఉన్ని ముకుందన్

  ఉన్ని ముకుందన్

  విలన్ పాత్రలో ఉన్ని ముకుందన్ ఫస్ట్ రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని తెలిపారు.

  కాజల్ హాట్

  కాజల్ హాట్

  ‘పక్కా లోకల్' స్పెషల్ సాంగులో కాజల్ చాలా హాట్ గా కనిపించిందని తెలిపారు.

  డిఎస్పీ

  డిఎస్పీ

  డిఎస్పీ మ్యూజిక్ రాకింగ్. బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్ అంటూ ప్రశంసించారు.

  టెక్నికల్

  టెక్నికల్

  స్టోరీ ఔట్ స్టాండింగ్ గా ఉంది, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో హైలెట్. ప్రొడక్షన్ డిజైన్ చాలా క్లాసీగా ఉంది. ఎడిటింగ్ క్రిస్పీ అండ్ షార్ప్, బోన్ బ్రేకింగ్ యాక్షన్ స్టంట్స్ అన్నారు.

  కొరటాల శివ

  కొరటాల శివ

  కొరటాల శివ మరోసారి సూపర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ చాలా బావుంది, సినిమాలో డల్ మూమెంట్ ఎక్కడా లేదు అన్నారు.

  రేటింగ్

  రేటింగ్

  జనతా గ్యారేజ్ ష్యూర్ బ్లాక్ బస్టర్, ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. నా రేటింగ్ 4/5 అని ఉమైర్ సంధు అన్నారు.

  ఇతడి రేటింగును నమ్మలేం...

  ఇతడి రేటింగును నమ్మలేం...

  గతంలోనూ ఉమైర్ సంధు చాలా సినిమాలకు రివ్యూ ఇచ్చారు. అందులో కొన్ని నిజం అవ్వగా... మరికొన్ని తలక్రిందులయ్యాయి. బాహుబలికి ఆయన చాలా పూర్ రేటింగ్ ఇచ్చారు. కానీ సినిమా పెద్ద హిట్టయి కూర్చుకుంది. కబాలికి మంచి రేటింగ్ ఇచ్చినా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మరి మొహంజోదారో విషయంలో ఉమైర్ సంధు రివ్యూ తిరగబడి సినిమా ప్లాప్ అయింది. మరి జనతా గ్యారేజ్ విషయంలో ఏం జరుగుతుందో?

  English summary
  Now lets check the UK Review of Janatha Garage given by Umair Sandhu, where the movie has got a 4-star rating and impressed the UK people.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X