twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గూబ గుయ్‌ మనేలా కొట్టడం అంటే ఇదే: ఏడుపు ఆపుకున్న ఎన్టీఆర్ (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్‌, సమంత, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మించిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. సెప్టెంబర్‌ 1న సినిమా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపడంతో హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు.

    ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్‌ కావాలో తెలియలేదు
    ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''ఆడియో ఫంక్షన్‌లో నాకు ఒక వెలుగు కనిపిస్తుందని చెప్పాను. ఆ వెలుగు జనతాగ్యారేజ్‌ అని తెలుస్తుంది. సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలైనప్పుడు చాలా రకాలుగు రిపోర్ట్స్‌ వచ్చినప్పుడు కాసేపు ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్‌ కావాలో తెలియలేదు. శివపై, ఈ కథపై పెట్టుకున్న నమ్మకం, అభిమానులకు ఇచ్చిన మాట తప్పు కాకూడదే అని లోపల చాలా బాధ పడిపోయాను అని ఎన్టీఆర్ తెలిపారు.

    కానీ అదే రోజుల అభిమానుల నుండి సాయంత్రం రిపోర్ట్స్‌ వింటుంటే ఈ మాటలు వినడానికి నాకు ఇన్నేళ్ళు పట్టిందా,ఇంతకంటే నాకేం అవసరం లేదనిపించింది. జనతాగ్యారేజ్‌ వల్ల అభిమానుల ముఖాల్లో సంతోషం, నా తల్లిదండ్రుల పుట్టినరోజున మంచి గిఫ్ట్‌ ఇచ్చినవాడినయ్యాను అన్నారు అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

    ఇలాంటి విజయం కోసమే నేను ఇనేళ్ళు ఆగాను

    ఇలాంటి విజయం కోసమే నేను ఇనేళ్ళు ఆగాను

    నేను,కల్యాణ్‌ రామ్‌ అన్నయ్య చాలా బాధగా ఉందని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇలాంటి విజయం కోసమే నేను ఇనేళ్ళు ఆగాను. నా వెనుక నా అభిమానులు ఆగారు. అభిమానులు ముందు తలెత్తుకునేలా చేసిన జనతాగ్యారేజ్‌ సినిమాను ఇచ్చిన కొరటాలశివగారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నాపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమాతో నిజం చేశారు. నా గుండెలో, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విజయమిదని ఎన్టీఆర్ తెలిపారు.

    ఏడుపును ఆపుకుంటున్నాను

    ఏడుపును ఆపుకుంటున్నాను

    ఒకవైపు ఆనందంతో వచ్చే ఏడుపును ఆపుకుంటున్నాను. అభిమానులను సంతోషపరచడానికే నేను ఇక్కడ ఉన్నాను. జనతాగ్యారేజ్‌ విజయం కొత్త ఊపిరిని, కొత్త ఆనందాన్నిచ్చింది. బ్రతికినంత కాలం అభిమానుల ప్రేమను, అప్యాయతను పొందాలనే కోరుకుంటున్నాను. ఇంత పెద్ద విజయంలో భాగమైన నటీనటులకు, టెక్నిషియన్స్‌ థాంక్స్‌. జనతాగ్యారేజ్‌ అని ఏరోజైతే టైటిల్‌ పెట్టుకున్నామో ఆరోజు ప్రజలు మమ్మల్మి గుండెల్లో పెట్టుకుని తలెత్తుకునేలా చేశారు అని ఎన్టీఆర్ తెలిపారు.

    గూబ గుయ్‌ మనేలా ఎప్పుడు కొడతాం అని అనుకునేవాళ్ళం

    గూబ గుయ్‌ మనేలా ఎప్పుడు కొడతాం అని అనుకునేవాళ్ళం

    కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ... ''గత మూడేళ్ళుగా ప్రతిరోజు, ప్రతిసారి నేను, తమ్ముడు గూబ గుయ్‌ మనేలా ఎప్పుడు కొడతాం అని అనుకునేవాళ్ళం. కొడితే ఎలా ఉంటుందో మీరు చూపించారు. మా నాన్నగారి షష్టి పూర్తికి అభిమానులు మాకిచ్చిన గిఫ్ట్‌ ఇది. మా తమ్ముడు ఆకలి..మా నందమూరి అభిమానుల ఆకలిని ఇంత గొప్ప సక్సెస్‌తో తీర్చేసిన కొరటాలశివగారికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి థాంక్స్‌'' అన్నారు.

    ఆడియెన్స్‌కు పెద్ద థాంక్స్‌, జయహో జనతా

    ఆడియెన్స్‌కు పెద్ద థాంక్స్‌, జయహో జనతా

    కొరటాల శివ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ అంటనే నాకు సపరేట్‌ ఎనర్జీ. మోహన్‌లాల్‌, సురేష్‌, సాయికుమార్‌, సమంత, నిత్యామీనన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ ఇలా అందరి సపోర్ట్‌తో పాటు ఈ సినిమాను తమదిగా భావించిన అభిమానుల కారణంగానే సినిమా పెద్ద సక్సెస్‌ అయ్యింది. తారక్‌కి సక్సెస్‌ కొత్తకాదు. అయినా ఈ సక్సెస్‌లో నేను కూడా భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. టెంపర్‌ నుండి రూట్‌ మార్చి కొత్తగా చేస్తున్నారు. అలా చేయడం ఆడియెన్స్‌కు నచ్చింది, ఆదరిస్తున్నారు. అభిమానులు ఆదరణ ఇలాగే కొనసాగితే టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌ వంటి సినిమాలు ఎన్నింటినో చేస్తారు. అలాగే ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసిన ఆడియెన్స్‌కు పెద్ద థాంక్స్‌. జయహో జనతా''అన్నారు.

    ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం

    ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం

    ఎర్నేని నవీన్‌ మాట్లాడుతూ - ''ఇలాంటి మంచి పెద్ద హిట్‌ మూవీ చేసే అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్‌గారికి, దర్శకుడు కొరటాల శివగారికి థాంక్స్‌. సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు స్పెషల్‌ థాంక్స్‌. ఎన్టీఆర్‌గారు, కొరటాల శివగారు మా బ్యానర్‌లో ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం'' అన్నారు.

    సినిమా చూసి షాకయ్యాను

    సినిమా చూసి షాకయ్యాను

    సుకుమార్‌ మాట్లాడుతూ - ''సినిమా చూసి షాకయ్యాను. సినిమా బావుంది. తారక్‌కు ఫోన్‌ చేసి బావుందని చెప్పాను కానీ, ఎక్కడో డౌట్‌ ఉండేది. అయితే సినిమా విడుదలైన తర్వాత తారక్‌కు ఇలాంటి సినిమా అవకాశం వస్తే ఎలా కొడతాడని ప్రూవ్‌ చేసిన చిత్రమిది. సినిమా తీయడానికి కామెడి అక్కర్లేదు అని నమ్మే వాళ్లందరికీ కొరటాల శివ దారి చూపించాడు. సినిమా చరిత్రలో శివ ముందు, శివ తర్వాత అని ఎలా చెబుతారో, ఇకపై కమర్షియల్‌ సినిమా విషయానికి వస్తే, కొరటాల శివకు ముందు, కొరటాల శివకు తర్వాత అని చెబుతారు. అందులో నో డౌట్‌. నన్ను అంత బాగా ఇన్‌స్పైర్‌ చేశారు.'' అన్నారు.

    ఇచ్చట అన్ని రికార్డులు చేయబడును

    ఇచ్చట అన్ని రికార్డులు చేయబడును

    సాయికుమార్‌ మాట్లాడుతూ - ''జనతాగ్యారేజ్‌ ఇచ్చట అన్ని రికార్డులు చేయబడును. నా మొదటి సినిమా స్వర్గీయ ఎన్టీఆర్‌తో యాక్ట్‌ చేశాను. తర్వాత బాలయ్యతో రౌడీ ఇన్సెపెక్టర్‌ చేశాను. అలాగే కల్యాణ్‌రామ్‌గారితో పటాస్‌ చేశాను. ఇప్పుడు ఎన్టీఆర్‌తో జనతాగ్యారేజ్‌ చేయడం ఆనందంగా ఉంది. పోలీస్‌ స్టోరీకి నాకు పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అని ఎంత పేరు వచ్చిందో, ఈ సినిమాకు డిగ్నిఫైడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అని పేరు వచ్చింది''అన్నారు.

    English summary
    Janatha Garage Movie Success Meet held at Hyderabad. Jr NTR, Koratala Siva, Saikumar, Suresh, Naveen Yerneni, Y Ravi Shankar, CV Mohan, Tirru, Kotagiri Venkateswara Rao, Sukumar, BVSN Prasad, Ramajogayya Sastry, Banerjee, Nandamuri Kalyan Ram, DVV Danayya, Dil Raju and others have attended the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X