»   » శ్రీదేవి కూతురుపై ఎఫైర్ రూమర్స్: ఈ ఫోటోల వెనక ఉన్న అసలు కథ ఇదే!

శ్రీదేవి కూతురుపై ఎఫైర్ రూమర్స్: ఈ ఫోటోల వెనక ఉన్న అసలు కథ ఇదే!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Jahnavi Kapoor Gets Rumours With Her Co-Star

  శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ 'ధడక్' అనే సినిమా ద్వారా హీరోయిన్‍‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రం ద్వారా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. జాహ్నవి, ఇషాన్ ఖట్టర్ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్లు ఉన్న ఈ ఫోటోలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

  ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు

  ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు

  ఇంటర్నెట్లో వైరల్ అయిన ఫోటోల్లో ఒక దానిలో జాహ్నవి ఒడిలో ఇషాన్ ఖట్టర్ కూర్చుని ఉండటం చూసి ఇద్దరి మధ్య ఇంత క్లోజ్ నెస్ ఏమిటో అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దని, ఈ ఫోటోలో ఇతర యూనిట్ సభ్యులు కూడా ఉన్న విషయం గుర్తించాలని, షూటింగులో భాగంగానే ఇషాన్ ఆమె ఇడిలో కూర్చున్నారని చిత్ర యూనిట్ అంటోంది.

  అంత సీన్ లేదమ్మా

  అంత సీన్ లేదమ్మా

  ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ కలిసి పానీ పూరి తింటున్నారు. ఈ ఫోటో చూసిన చాలా మంది ఇద్దరూ కలిసి షూటింగ్ గ్యాపులో డేటింగుకు వెళ్లారు అని చర్చించుకుంటున్నారు. అయితే అదంతా నిజం కాదు, ఇది సినిమాలోని ఓ సన్నివేశమే..... షూటింగ్ గ్యాపులో యాక్టర్స్ బయటకు వెళ్లి రోడ్డు మీద పానీపూరీ తినేంత సీన్ ఉండదని అంటున్నారు.

   ప్రేమికులుగా నటిస్తున్నారు, ప్రేమికులు కాదు

  ప్రేమికులుగా నటిస్తున్నారు, ప్రేమికులు కాదు

  జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ ‘ధడక్' సినిమాలో ప్రేమికులుగా నటిస్తున్నారు. అంతే తప్ప వీరు ప్రేమికులు కాదు, షూటింగుకు సంబంధించిన ఫోటో చూసి ఏదేదో ఊహించుకోవద్దు అని జాహ్నవి కపూర్ సన్నిహితులు చెబుతున్న మాట.

   విక్టోరియా మెమొరియల్

  విక్టోరియా మెమొరియల్

  ‘ధడక్' చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లు ఇటీవల కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద చిత్రీకరించారు. కథ ప్రకారం..... పెద్దలు అడ్డుచెప్పడంతో ఈ ఇద్దరు ప్రేమికులు తమ గ్రామం నుండి పారిపోయి కోల్‌కతా వెళ్లి పెళ్లి చేసుకుంటారు.

  నటించారు అని చెప్పడం కంటే...

  నటించారు అని చెప్పడం కంటే...

  రేపు ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత.....ఈ చిత్రంలో జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించారు అనకుండా, జీవించారు అని ప్రశంసలు వస్తాయని, ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

  వెరీ ప్రొఫెషనల్

  వెరీ ప్రొఫెషనల్

  జాహ్నవికి ఇదే తొలి సినిమా అయినా సెట్లో ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటుందని, నటన, కష్టపడే తత్వాన్ని తల్లి శ్రీదేవి నుండి అందిపుచ్చుకుందని...... సెట్లో అందరితో ఎంతో సరదాగా ఉంటుందని పొగడ్తలు గుప్పిస్తోంది ‘ధడక్' మూవీ టీం.

  English summary
  Fans are eagerly waiting for one of the most anticipated films of the year - Dhadak. And why not? After all it marks the debut of two of the popular star-kids - Janhvi Kapoor (Sridevi-Boney Kapoor's daughter) and Ishaan Khattar (Shahid Kapoor's half-brother). Recently, the duo was spotted shooting for Dhadak in Kolkata and their pictures are doing rounds on the social media for all the right reasons.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more