ఓ వైపు కొండంత దు:ఖం... జాహ్నవి కపూర్ పుట్టినరోజు వేడుక ఇలా జరిగింది... (ఫోటోస్)

By Bojja Kumar

Recommended Video

Janhvi Kapoor Celebrates Her 21st Birthday జాహ్నవి కపూర్ పుట్టినరోజు వేడుక

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నేడు(మార్చి 6) 21వ వసంతంలోకి అడుగు పెట్టింది. తల్లి మరణంతో గత 10 రోజులుగా పుట్టెడు దు:ఖంలో ఉన్న జాహ్నవి కపూర్‌ను ఆ బాధ నుండి బయటపడేసే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఆమెతో బర్త్ డే కేక్ కట్ చేయించారు.

అయిష్టంగానే...

ఈ విషాద సమయంలో పుట్టినరోజు వేడుక చేసుకోవాలని లేక పోయినా వారి సంతోషం కోసం అయిష్టంగానే జాహ్నవి ఈ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. లోపల కొండత దు:ఖం ఉన్నా పైకి నవ్వు నటిస్తూ తన ముఖంలో సంతోషం చూడాలని ఆశపడ్డ తన స్నేహితులు, కుటుంబ సభ్యులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు.

అనాధ శరణాలయంలో...

తన పుట్టినరోజు సందర్భంగా జాహ్నవి కపూర్ అనాధ శరణాలయాన్ని సందర్శించారు. వారితో కలిసి వేడుక జరుపుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లి శ్రీదేవి ప్రారంభించిన ఈ సాంప్రదాయన్ని జాహ్నవి తన పుట్టినరోజున కొనసాగించారు.

అపుడు ఎంతో సంతోషంగా

శ్రీదేవి బ్రతికున్నంతకాలం తన ఇద్దరు కూతుళ్లు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. ఇండస్ట్రీలో తనకు ఉన్న అనుభవంతో ప్రతి విషయంలో వారికి సపోర్టుగా ఉంటూ వారిని ఓ స్థాయికి తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. మరికొన్ని నెలల్లో జాహ్నవి తొలి సినిమా విడుదల కావాల్సి ఉండగా.....అది చూడకుండానే శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం దురదృష్టమే.

 నువ్వు గర్వపడేలా చేస్తా అమ్మా అంటూ....

నువ్వు గర్వపడేలా చేస్తా అమ్మా అంటూ....

‘నా మనసులో తీరని లోటు ఏర్పడింది. ఇకపై ఎలా జీవించాలనేది నేర్చుకోవాలి. ఈ లోటు ఉన్నప్పటికీ నేను నీ ప్రేమ అనుభూతిని పొందుతున్నాను. నువ్వు నన్ను బాధ నుంచి, నొప్పి నుంచి సంరక్షిస్తున్నట్లే అనిపిస్తోంది. కళ్లు మూసిన ప్రతిసారి నీ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఒక ప్రాణ స్నేహితురాలిగా మాతో మెలిగావు, నీ జీవితాన్ని మొత్తం మాకు ఇచ్చేశావు. ఇప్పుడు నీ కోసం అదే చేయాలి అనుకుంటున్నా అమ్మా.... నువ్వు గర్వపడేలా చేస్తా, నిన్ను చూసి నేను ఎంత గర్వపడ్డానో అదే రీతిగా నన్ను చూసి నువ్వు గర్వపడే రోజు వస్తుందని ఆశతో ముందుకు సాగుతా, ఇదే ఆలోచనతో ప్రతిరోజు నిద్రలేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా.... అంటూ జాహ్నవి కపూర్ ఇటీవల విడుదల చేసిన ఓ లేఖలో పేర్కొన్నారు.

 షూటింగులో బిజీ కానున్న జాహ్నవి

షూటింగులో బిజీ కానున్న జాహ్నవి

ఈ బాధ నుండి బయట పడేందుకు జాహ్నవి కపూర్ ‘ధడక్' షూటింగులో బిజీ కానున్నారు. తన తల్లి తనను ఏ స్థాయిలో చూడాలనుకున్నారో.... ఆ స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తానని జాహ్నవి కపూర్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X