Just In
- 39 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దిల్ రాజు చెప్పగానే పారిపోయా.. దానిగురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది: సమంత
నిన్న (శనివారం) జరిగిన 'జాను' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత మాట్లాడిన మాటలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాయి. ఓ వైపు జాను మూవీ గురించి చెబుతూనే మరోవైపు దిల్ రాజు, శర్వానంద్ లపై కామెంట్స్ చేసింది సమంత. మరి వాళ్లపై సామ్ కామెంట్స్ ఏంటనే దానిపై ఓ లుక్కేద్దామా..

96 రీమేక్.. సమంత, శర్వానంద్ జోడీ
తమిళ నాట విడుదలై మొత్తం దక్షిణాదిని ఓ ఊపు ఊపిన 96 చిత్రానికి రీమేక్ సినిమాగా 'జాను' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో సమంత, శర్వానంద్ లీడ్ రోల్స్ పోషించారు. ఒరిజినల్‌ను రూపొందించిన సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఫిబ్రవరి 7న 'జాను' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.

జాను ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్
ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో హీరోయిన్లతో పాటు నేచురల్ స్టార్ నాని, వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.

ఎప్పటికీ అదే మోడ్.. ఏ ఒక్కరినీ డిజప్పాయింట్ చేయకూడదని!
ఈ వేదికపై సమంత మాట్లాడుతూ.. తన సక్సెస్ సీక్రెట్ బయటపెట్టింది. తాను ప్రతి సినిమాకు ఏ ఒక్కరినీ డిజప్పాయింట్ చేయకూడదని భయపడుతూనే ఉంటానని.. అందుకే ప్రతి సినిమాను తన మొదటి సినిమాగానే భావిస్తానని తెలిపింది సామ్. ప్రతీ సినిమా షూటింగ్ స్పాట్‌లో అది తన తొలి సినిమా అనే మోడ్ లోనే ఉంటానని సమంత చెప్పింది.

దానిగురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
''తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘96'ను తెలుగులో ‘జాను' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అనుకుంటున్నా. కానీ ఫిబ్రవరి 7 తరువాత ఖచ్చితంగా మాట్లాడతా. ప్రతిరోజు నేను ప్యాకప్ చెప్పిన తర్వాత ఓ మ్యాజిక్ జరిగినట్టే భావించా. ఆ మ్యాజిక్ ఏంటన్నది ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో మీరే చూస్తారు'' అని తెలిపింది సామ్.

దిల్ రాజు చెప్పగానే పారిపోయా..
ఇక ఈ సినిమా చేయాలని దిల్ రాజు మొదట్లో చెప్పినప్పుడు పారిపోయానని, అయినప్పటికీ ఆయన వెంటపడి మరీ తనను ఒప్పించారని సమంత చెప్పింది. ఆయన వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాను. ఈ సినిమాలో నా రోల్ బాగా పండింది అంటే అది హీరో శర్వానంద్ వల్లనే. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అంటూ సమంత పలు విషయాలు చెప్పింది.