»   » ఆడ, మగ కలిసి తిరిగితే తప్పు చేసినట్లేనా?... హీరోయిన్ ఫైర్

ఆడ, మగ కలిసి తిరిగితే తప్పు చేసినట్లేనా?... హీరోయిన్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆడ, మగ కలిసి తిరిగినంత మాత్రాన, సరదాగా గడిపినంత మాత్రాన ఇద్దరూ తప్పు చేసినట్లేనా? వెంటనే ఇద్దరికీ రంకు అంటగడతారా? అంటూ మండి పడుతోంది టాలీవుడ్ హీరోయిన్ జాస్మిన్ భాసిన్.

తెలుగులో దిల్లున్నోడు, వేట, లేడీస్ అండ్ జెంటిల్మెన్ చిత్రాల్లో హీరోయిన్ నటించిన జాస్మిన్ భాసిన్.... టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో కలిసి క్లోజ్ గా ఉంటుండటంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ మీడియాలో ప్రచారం మొదలైంది.

మీడియాపై ఫైర్

మీడియాపై ఫైర్

తమ మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు రావడంపై జాస్మిన్ భాసిన్ మండి పడింది. మేము ఇద్దరం దిల్ సే దిల్ తక్ అనే హిందీ టీవీ సీరీస్ లో కలిసి నటించాం. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య అంతకు మించి ఏమీ లేదు అని జాస్మిన్ భాసిన్ తెలిపారు.

సిద్ధార్థ్ లాంటి బాయ్ ఫ్రెండ్ ను కోరుకుంటారు

సిద్ధార్థ్ లాంటి బాయ్ ఫ్రెండ్ ను కోరుకుంటారు

సిద్ధార్ లాంటి బాయ్ ఫ్రెండ్ ను అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అతడు చాలా కూల్, ఇంటలిజెంట్, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. కానీ మా మధ్య స్నేహం తప్ప మరేమీ లేదు. అనవసరంగా ఎవరూ ఏమీ ఊహించుకోవద్దు అని జాస్మిన్ భాసిన్ తేల్చి చెప్పింది.

హీరోయిన్ గా

హీరోయిన్ గా

తమిళ చిత్రం ‘వానమ్' సినిమా ద్వారా జాస్మిన్ భాసిన్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత కన్నడలో ‘కరోడ్‌పతి', అనంతరం మళయాలంలో ‘బివేర్ ఆఫ్ డాగ్స్' అనే చిత్రాలు చేసింది.

అంతంత మాత్రమే

అంతంత మాత్రమే

ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లయినా జాస్మిన్ భాసిన్ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. అప్పుడు ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ చిన్న సినిమాలే కావడం, సరైన బ్రేక్ రాక పోవడంతో అవకాశాలు లేవు. ప్రస్తుతం కలర్స్ టీవీలో దిల్ సె దిల్ తక్ అనే టీవీ సిరీస్ చేస్తోంది.

English summary
Jasmin Bhasin denies dating Siddharth Shukla. “This is just a rumour. He is my best friend and there is nothing more than friendship between us." Jasmin Bhasin said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu