»   » సెల్ఫీకి ప్రయత్నించిన అభిమానిపై ‘బేవకూఫ్’ అంటూ తిట్లు!

సెల్ఫీకి ప్రయత్నించిన అభిమానిపై ‘బేవకూఫ్’ అంటూ తిట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అరచేతిలో కెమెరా ఫోన్లు వచ్చాక.... సెల్ఫీ కల్చర్ బాగా పెరిగింది. ఎవరైనా సెలబ్రిటీలు కనిపిస్తే అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ముచ్చటపడుతుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొందరు స్టార్లు వారికి కోరిక తీర్చడం చేస్తుంటే... మరికొందరేమో అలాంటివారిపై ఆగ్రహంతో ఊగిపోవడం చేస్తున్నారు.

గతంలో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించిన అభిమానులపై కొందరు స్టార్లు దాడి చేయడం, వారి సెల్ ఫోన్లు ధ్వంసం చేయడం లాంటివి చేయడం చూశాం. తాజాగా ఓ అభిమాని పట్ల అనుచితంగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కారు బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్.

Jaya Bachchan bashes fan for taking selfies

ముంబైలోని మహా గణపతిని దర్శించుకునేందుకు ఆమె ఓ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని యత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన జయా బచ్చన్ 'అలా చేయకు.. బేవకూఫ్(స్టుపిడ్)' అంటూ మండి పడ్డారు. గతంలో కూడా తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పూజారిపై ఆమె మండి పడ్డారు.

English summary
Veteran actress Jaya Bachchan lashed out at a young fan while coming out of Shree Mankeshwar Mandir in Mumbai for taking selfies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu