»   » నటి జయప్రదకు ప్రతిష్టాత్మక ‘కళాశ్రీ’ అవార్డు

నటి జయప్రదకు ప్రతిష్టాత్మక ‘కళాశ్రీ’ అవార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటి జయప్రద ప్రతిష్టాత్మక ‘కళాశ్రీ' అవార్డుకు ఎంపికయ్యారు. దాదా సాహెబ్ ఫిల్మ్ ఫౌండేషన్ ఈ అవార్డును మంగళవారం ముంబైలో ఆమెకు అందసారు. ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని, సినీ రంగానికి భవిష్యత్తులో కూడా సేవ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు.

ఒకప్పుడు దక్షిణాది సినిమాలతో పాటు ఉత్తరాది సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జయప్రద.....హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ తరుపున ఎంపీగా గెలుపొందింది.

Jaya Prada

జయప్రద 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రి లో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ మరియు నీలవేణి దంపతులకు జన్మించినది. ఈమె 1986 జూన్ 22 న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడింది.14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వార ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ మరియు బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించినది.

English summary
Actor-turned-politician Jaya Prada was conferred with Kalashree Award by the Dada Saheb Phalke Film Foundation.
Please Wait while comments are loading...